ఫ్లైఓవర్పై నుంచి కిందపడిన మిర్చీ లారీ | Lorry accident in Guntur district | Sakshi
Sakshi News home page

ఫ్లైఓవర్పై నుంచి కిందపడిన మిర్చీ లారీ

Mar 6 2015 8:38 AM | Updated on Aug 24 2018 2:36 PM

గుంటూరు జిల్లా ఫిరంగిపురం నుదురుపాడు వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

గుంటూరు: గుంటూరు జిల్లా ఫిరంగిపురం నుదురుపాడు వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  మిర్చీ లోడుతో వెళ్తున్న లారీ ఫ్లైఓవర్పై నుంచి కింద పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement