భూముల సర్వేను అడ్డుకున్న రైతులు | land survey for airport in chittoor distirict | Sakshi
Sakshi News home page

భూముల సర్వేను అడ్డుకున్న రైతులు

Sep 1 2015 11:59 AM | Updated on Oct 1 2018 2:00 PM

చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్‌పోర్టు సర్వే బృందం మంగళవారం పర్యటించింది.

శాంతిపురం: చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్‌పోర్టు సర్వే బృందం మంగళవారం పర్యటించింది. వీరు మండలంలో ఏర్పాటు చేసిన ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం స్థలాన్ని సర్వే చేసేందుకు వచ్చినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన రైతులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్ధలానికి చేరుకొని ఆరుగురు సభ్యుల బృందాన్ని అడ్డుకున్నారు. విమానాశ్రయానికి మేం భూములు ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. భారీగా పోలీసు బలగాలను మోహరించడంతో పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement