కృష్ణగాడి వీరప్రేమగాథ చిత్ర బృందం సందడి | Sakshi
Sakshi News home page

కృష్ణగాడి వీరప్రేమగాథ చిత్ర బృందం సందడి

Published Wed, Feb 17 2016 3:29 AM

కృష్ణగాడి వీరప్రేమగాథ  చిత్ర బృందం సందడి

విశాఖ-కల్చరల్:  కృష్ణగాడి వీరప్రేమ గాధ టీమ్ రేడియో మిర్చిలో సందడి చేశారు. ఈ చిత్రం విజయోత్సవ యాత్రని పురస్కరించుకొని మంగళవారం నగరంలో యూనిట్ బృందం పర్యటించారు. హీరో నాని ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ఈ చిత్రాన్ని డెరైక్టర్ హాను చాలా బాగా తీశారని, ప్రతి ఒక్క అంశంలో తన శైలిలో ప్రత్యేకత కనిపించే విధంగా చిత్రీకరించారని తెలిపారు. ఈ సినిమా విజయానికి ఆయనే ప్రధాన కారణమని చెప్పారు. విశాఖ అంటే తనకు ఎంతో ఇష్టమని, విశాఖవాసులు తన సినిమాను తప్పక ఆదరిస్తారనిధీమావ్యక్తంచేశారు.అనంతరం శ్రోతలతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. కార్యక్రమంలో చిత్ర బృందంతోపాటు మయగాడు ఫేమ్ కావ్య, అవిలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement