కోడెల కాల్‌ డేటాపై ఆ వార్తలు అవాస్తవం : ఏసీపీ

Kodela Siva Prasada Rao Son Will Be Interrogated Says ACP KS Rao - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/అమరావతి : టీడీపీ సీనియర్‌ నేత, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మృతిపై దర్యాప్తు కొనసాగుతోందని బంజారాహిల్స్‌ ఏసీపీ కే.శ్రీనివాసరావు వెల్లడించారు. అనుమానం ఉన్న వారందరినీ విచారిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 12 మందిని విచారించామని చెప్పారు. కోడెల కుంటుంబ సభ్యుల స్టేట్‌మెంట్లను రికార్డు చేశామని తెలిపారు. కోడెల భౌతిక కాయానికి సంబంధించి పోస్టుమార్టం పూర్తి నివేదిక ఇంకా అందలేదని పేర్కొన్నారు. కోడెల ఫోన్‌లోని కాల్‌డేటా ఆరా తీస్తున్నామని పేర్కొన్నారు. సీడీఆర్‌ఏ కాల్‌ లిస్టు రిపోర్టును పరిశీలిస్తున్నామన్నారు. ఇక సోషల్‌ మీడియాలో కోడెల కాల్‌ డేటాపై వస్తున్న వార్తలు అవాస్తవమని అన్నారు. కోడెల కుమారుడు శివరామ్‌ను త్వరలోనే విచారిస్తామని ఏసీపీ స్పష్టం చేశారు.
(చదవండి : ఒక మరణం.. అనేక అనుమానాలు)

మొబైల్‌ ఇంకా దొరకలేదు..
కోడెల శివప్రసాదరావు మృతి కేసులో కీలకం కానున్న ఆయన మొబైల్‌ ఇంకా దొరకలేదని వెస్ట్‌ జోన్‌ డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. విచారణ కొనసాగుతోందని అన్నారు. ‘సత్తెనపల్లిలో కోడెల మేనల్లుడు కంచేటి సాయి ఇచ్చిన ఫిర్యాదు ఫ్యాక్స్ ద్వారా అందింది. న్యాయనిపుణుల సలహా తీసుకొని ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం. ప్రత్యక్ష సాక్షులు, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు రికార్డు చేశాం. కోడెల కుమారుడు శివరాంతో పాటు కోడెల సన్నిహితులు మరికొంతమందిని విచారించాల్సి ఉంది. కోడెల కాల్ డేటాపై ఆరా తీస్తున్నాం. ఆయన ఎవరెవరితో మాట్లాడారు అనేది తెలిస్తే కేసులో పురోగతి లభిస్తుంది. కోడెల పోస్టుమార్టం రిపోర్టు, కాల్ డేటా, ఎఫ్‌ఎస్సెల్‌ రిపోర్ట్ అందాల్సి ఉంది’అన్నారు.

(చదవండి : కోడెల మృతి: బీజేపీ అధికార ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top