'కిరణ్‌ను విభజన ద్రోహిగా గుర్తిస్తారు' | Kiran Kumar Reddy Betrayer, says T Jeevan Reddy | Sakshi
Sakshi News home page

'కిరణ్‌ను విభజన ద్రోహిగా గుర్తిస్తారు'

Jan 31 2014 2:48 PM | Updated on Jun 2 2018 4:41 PM

'కిరణ్‌ను విభజన ద్రోహిగా గుర్తిస్తారు' - Sakshi

'కిరణ్‌ను విభజన ద్రోహిగా గుర్తిస్తారు'

రాష్ట్ర విభజన బిల్లును అసెంబ్లీ తిరస్కరించిందనడం సరికాదని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి అన్నారు.

హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లును అసెంబ్లీ తిరస్కరించిందనడం సరికాదని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి అన్నారు. ఆర్టికల్ 3 ప్రకారం విభజన బిల్లుపై చర్చ ప్రక్రియ అసెంబ్లీలో సజావుగా జరిగిందని తెలిపారు. రూల్‌ 77 కింద విభజన బిల్లును వెనక్కి పంపాలనే తీర్మానాన్ని సభ ఆమోదించిందని చెప్పారు.

అయితే విభజన బిల్లును తిరస్కరించినట్టు కాదని స్పష్టం చేశారు. విభజన బిల్లును తిరస్కరించారంటూ సీఎం, మంత్రులు ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీమాంధ్ర ప్రజలు వాస్తవాన్ని గ్రహించి సీఎం కిరణ్‌ను విభజన ద్రోహిగా గుర్తిస్తారని జీవన్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement