breaking news
Assembly rule 77
-
'కిరణ్‌ను విభజన ద్రోహిగా గుర్తిస్తారు'
హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లును అసెంబ్లీ తిరస్కరించిందనడం సరికాదని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి అన్నారు. ఆర్టికల్ 3 ప్రకారం విభజన బిల్లుపై చర్చ ప్రక్రియ అసెంబ్లీలో సజావుగా జరిగిందని తెలిపారు. రూల్ 77 కింద విభజన బిల్లును వెనక్కి పంపాలనే తీర్మానాన్ని సభ ఆమోదించిందని చెప్పారు. అయితే విభజన బిల్లును తిరస్కరించినట్టు కాదని స్పష్టం చేశారు. విభజన బిల్లును తిరస్కరించారంటూ సీఎం, మంత్రులు ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీమాంధ్ర ప్రజలు వాస్తవాన్ని గ్రహించి సీఎం కిరణ్‌ను విభజన ద్రోహిగా గుర్తిస్తారని జీవన్‌రెడ్డి తెలిపారు. -
సీఎం నోటీసు చెల్లదు: షబ్బీర్ అలీ
హైదరాబాద్: రాష్ట్ర విభజనను సీఎం కిరణ్ అడ్డుకోలేరని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అన్నారు. పొలిటికల్ మైలేజీ, ప్రజలను గందరగోళ పర్చడానికే సీఎం కిరణ్ హడావుడి చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజలెవరూ అయోమయానికి గురికావడం లేదని, విభజన ప్రక్రియ సాఫీగా జరుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. విభజన బిల్లుపై 77వ నిబంధన కింద సీఎం కిరణ్ ఇచ్చిన తిరస్కార నోటీసును స్పీకర్ నాదెండ్ల మనోహర్ అనుమతించరని చెప్పారు. సమైక్య తీర్మానం చేయాలని, విభజన బిల్లును రాష్ట్రపతికి వెనక్కి పంపాలని 77, 78 నిబంధనల కింద నోటీసులిచ్చినా స్పీకర్ పట్టించుకోలేదని గుర్తు చేశారు. ఈ రెండు నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వ బిల్లులకే వర్తిస్తాయని షబ్బీర్ అలీ అన్నారు. రాష్ట్రపతి పంపిన విభజన బిల్లుకు ఇది వర్తించదన్నారు. గతంలో స్పీకర్‌గా ఉన్న సీఎంకు వీటిపై అవగాహన ఉందని గుర్తు చేశారు.