బీజేపీ నాయకుల విమర్శలు దారుణం   | Kavali MLA Fires on Local BJP Leader About Land Issue | Sakshi
Sakshi News home page

బీజేపీ నాయకుల విమర్శలు దారుణం  

Jun 30 2019 12:01 PM | Updated on Jun 30 2019 12:01 PM

Kavali MLA Fires on Local BJP Leader About Land Issue - Sakshi

వైఎస్సార్‌సీపీ నాయకులు, కౌన్సిలర్లతో కలిసి మాట్లాడుతున్న ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి

కావలి: ప్రైవేట్‌ వ్యక్తుల భూములను కావలికి చెందిన బీజేపీ నాయకురాలు వరలక్ష్మమ్మ పేదలకు అమ్మేసిందని, ఆ భూముల యజమానుల ఫిర్యాదు మేకు అధికారులు చర్యలు తీసుకుంటుంటే అధికార పార్టీ అన్యాయం చేస్తుందని భారతీయ జనతా పార్టీ నాయకుడు కందుకూరి వెంకట సత్యనారాయణ తమను విమర్శించడం దారుణమని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. కావలిలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. బీజేపీ నాయకుడు కందుకూరి వెంకట సత్యనారాయణ తనకు ఫోన్‌ చేసి కావలి సబ్‌ కలెక్టర్‌ కొందరు రౌడీలను తీసుకొచ్చి పట్టణంలోని 16వ వార్డు బాలకృష్ణారెడ్డి నగర్‌లో పేదల ఇళ్లను జేసీబీలతో కూల్చేస్తున్నారని చెప్పారన్నారు. తాను అప్పడే మున్సిపాలిటీ కౌన్సిల్‌ సమావేశానికి హాజరుకావడానికి బయలుదేరుతున్నానన్నారు. అయినప్పటికీ సబ్‌ కలెక్టర్‌తో మాట్లాడుదామని కార్యాలయానికి రావాలని కందుకూరి వెంకట సత్యనారాయణను సూచించానని ఎమ్మెల్యే వెల్లడించారు. సరే అని  సత్యనారాయణ చెప్పడంతో తాను సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకుని ఆయన కోసం ఎదురు చూశానన్నారు.

ఆయన రాలేదని  తానే  ఆయనకు ఫోన్‌ చేసి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఉన్నానని, ఎప్పుడు వస్తారని సత్యనారాయణను అడిగాననని ఎమ్మెల్యే వివరించారు. తాను ఇళ్లు కూల్చేసే చోట ఉన్నానని ఆయన చెప్పడంతో, తాను అక్కడ్నుంచి బయలుదేరి మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకున్నానన్నారు. కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొన్నానని ఎమ్మెల్యే చెప్పారు. కాగా తాను ఈ వివాద వ్యవహరాన్ని ఆరా తీయగా, ప్రైవేట్‌ వ్యక్తులకు చెందిన ఇంటి స్థలాలను బీజేపీ నాయకురాలు వరలక్షమ్మ పేదలకు అక్రమంగా అమ్మేసి సొమ్ము చేసుకుందని ఆరోపించారు. అందులో ఇతరులు ఇళ్లు నిర్మించుకోగా, స్థల యజమానులు చేసిన ఫిర్యాదు మేరకు సబ్‌ కలెక్టర్, డీఎస్పీలు విచారించి చర్యలు తీసుకున్నట్లు తెలిసిందన్నారు. జరిగిన వాస్తవం ఇది అయితే తమ పార్టీ వారు పేదల ఇళ్లును కూల్చేశారంటూ బీజేపీ నాయకుడు కందుకూరి వెంకట సత్యనారాయణ ప్రచారం చేయడం ఎంతవరకు సబబు అని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. ఆక్రమణలను ప్రోత్సహించవద్దని, సంపూర్ణంగా అరికట్టాలనే విషయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృఢమైన నిర్ణయంతో ఉన్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

తాము కూడా కావలిలో ఆక్రమణలను ప్రోత్సహించే వారిని సహకరించబోమన్నారు. చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు చెబుతామన్నారు. బాలకృష్ణారెడ్డి నగర్‌లో పేదల వద్ద సొమ్ము వసూలు చేసిన బీజేపీ నాయకురాలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇల్లు లేని పేదలు ఉంటే వారందరికీ తాము ఇంటి స్థలాలు, ఇళ్లు ప్రభుత్వం ద్వారా మంజూరయ్యేలా చేస్తామన్నారు. పేదలకు న్యాయం చేస్తామే కాని, అట్లాగని ప్రైవేట్‌ వ్యక్తుల స్థలాలను ఆక్రమించుకుంటామని, పేదలు వద్ద వసూళ్లకు పాల్పడుతామని అంటే ఊరుకునే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement