'అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు' | JC Prabhakar Reddy takes on Raghuveera Reddy | Sakshi
Sakshi News home page

'అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు'

Sep 5 2014 12:08 PM | Updated on Aug 29 2018 6:00 PM

'అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు' - Sakshi

'అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు'

ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డిపై తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డిపై తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మైకుల ముందు రఘువీరా అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

మంత్రిగా ఉన్నప్పుడు రఘువీరా ఏ రోజూ సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనలేదని అన్నారు. ఇప్పుడు రాజధాని ఎక్కడ పెట్టాలనే దానిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని అడిగే హక్కు ఆయనకు లేదని అన్నారు. అనంతపురం జిల్లాకు ఇప్పటిదాకా రఘువీరా ఏమీ చేయలేదని ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement