వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసు; శ్రీనివాసరావుకు అనారోగ్యం

Janupalli Srinivasa Rao Admitted In Rajahmundry Hospital Due To Illness - Sakshi

రాజమండ్రి ఆస్పత్రిలో చేరిక

సాక్షి, తూర్పు గోదావరి :  వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాస్‌రావు తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. అతన్ని రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. శ్రీనివాస్‌ ఆరోగ్యానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, గతేడాది అక్టోబర్‌ 25న విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైఎస్‌ జగన్‌పై.. టీడీపీ నేతకు చెందిన ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌లో పనిచేసే శ్రీనివాసరావు పదునైన కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే సీఎం చంద్రబాబుతో పాటు డీజీపీ, మంత్రులు, టీడీపీ నేతలు తెరపైకి వచ్చి నిందితుడు శ్రీనివాసరావు వైఎస్‌ జగన్‌ అభిమానే అంటూ తప్పుడు ప్రచారం చేశారు. హత్యాయత్నాన్ని చాలా తేలిగ్గా తీసిపారేశారు.

ఈ కేసును తొలుత రాష్ట్ర ప్రభుత్వం సిట్‌కు అప్పగించింది. అయితే, ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ఈ కేసును శ్రీనివాసరావు ఒక్కడికే పరిమితం చేసి, సూత్రధారులు, కుట్రదారులను తప్పించారు. చివరకు హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు విచారణను ఎన్‌ఐఏకు అప్పగించారు. అయితే, ఈ కేసులో ఇంకా ప్రాథమిక దర్యాప్తు కూడా పూర్తి కాకుండానే చంద్రబాబు సహా పలువురు టీడీపీ నేతలు ఈ కేసును మొదటి నుంచీ తప్పుదోవ పట్టించేలా ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారని  జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారి మహ్మద్‌ సాజిద్‌ఖాన్‌ ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారు.

(చదవండి : మా విచారణ పూర్తికాలేదు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top