అకృత్యంపై ఆగ్రహజ్వాల

Jammu Kashmir Girl Ashiffa Sexual Assault Ysrcp Protest In Adoni - Sakshi

ఆదోని అర్బన్‌/రూరల్‌ : అభం.. శుభం.. తెలియని ఎనిమిదేళ్ల చిన్నారి ఆసిఫాపై కశ్మీర్‌లో జరిగిన లైంగిక దాడి, హత్యాకాండపై జిల్లావ్యాప్తంగా నిరసన జ్వాలలు రగులుతున్నాయి. శనివారం ఆదోనిలో వైఎస్‌ఆర్‌సీపీ, కాంగ్రెస్, ముస్లిం మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో వేలాది మంది పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. నాయకులు, కార్యకర్తలు, అన్ని వర్గాల జనం నల్లబ్యాడ్జీలతో పట్టణంలోని పాత పోస్టాఫీసు నుంచి  షరాఫ్‌ జార్, పీఎన్‌రోడ్, ఎంఎం రోడ్, కోట్ల కూడలి మీదుగా ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయం చేరుకుని అక్కడ బైఠాయించారు. ఆసిఫాకు జరిగిన అన్యాయంపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్డీఓ కార్యాలయ పరిపాలనాధికారికి వినతి పత్రం అందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఆసిఫాపై లైంగిక దాడికి పాల్పడి హతమార్చడం దారుణమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ముస్లిం మత పెద్దలు అలీఆజ్మీ అల్తాఫ్, ఖాజా అల్తాఫ్‌  హుసేన్, నాయకులు సౌదీ రవూఫ్, షఫీ, అప్సర్‌బాషా, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అల్తాఫ్, వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్‌ నాయకులు చంద్రకాంత్‌ రెడ్డి, ఇక్బాల్, ఎజాజ్, సాయిరాం, నీలకంఠప్ప, దిలీప్‌దోఖా తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top