తరాలు మారినా మరువలేని వ్యక్తి టి.కృష్ణ

Hero Gopichand Participate In T Krishna Death anniversary - Sakshi

ఒంగోలు అర్బన్‌: తరాలు మారినా జిల్లాతో పాటు సినీ పరిశ్రమ మరిచిపోలేని వ్యక్తి టి. కృష్ణ అని జెడ్పీ చైర్మన్‌ ఈదర హరిబాబు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు అన్నారు. స్థానిక ఎన్టీఆర్‌ కళాపరిషత్‌లో ప్రజా నాట్యమండలి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు (అన్న) సహకారంతో ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో సంచలన సినీ దర్శకుడు టి. కృష్ణ 32వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తొలుత టి. కృష్ణ తనయుడు హీరో గోపీచంద్‌ అతిథులతో కలిసి టి. కృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వక్తలు మాట్లాడుతూ టి. కృష్ణ తక్కువ చిత్రాలు తెరకెక్కించినా వాటిలో సామాజిక స్పృహ స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా స్నేహనికి అపారమైన విలువనిచ్చే వ్యక్తి అని కొనియాడారు.  తండ్రి కార్యక్రమానికి ప్రతి ఏడాది హాజరవుతూ పేద విద్యార్థులకు తనవంతు సాయం చేస్తూ జిల్లా ప్రజల పట్ల అభిమానం చూపుతున్న గోపిచంద్‌ అభినందనీయుడన్నారు. జిల్లాలో టి. కృష్ణ పేరు శాశ్వతంగా ఉండేలా ఆడిటోరియం ఏర్పాటు చేయాలని కోరారు.

కార్యక్రమానికి సరోజ్‌సేవా ఫౌండేషన్, ఆసరా కేంద్రాల అధ్యక్షులు చిడిపోతు వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. సభలో రిటైర్డ్‌ జేసీ షంషీర్‌ అహ్మద్, పి.హెచ్‌.జి కృష్ణంరాజు, మోపర్తి నాగేశ్వరరావు, ఎస్‌.డి సర్దార్, ఉప్పుటూరి ప్రకాశరావు, పొన్నూరి శ్రీనివాసులు, ఇండ్లమూరి రామయ్య, వడ్డేల సింగయ్య, కృష్ణయ్య, ఉప్పుటూరి రవిచంద్ర, గని, పూర్ణ తదితరలు పాల్గొన్నారు. ఆ తండ్రికి జన్నించడం పూర్వజన్మ సుకృతం టి. కృష్ణ తనయుడు, ప్రముఖ సినీ హీరో గోíపిచంద్‌ అన్నారు. ఆయన బాటలో నడుస్తూ పలువురు ఇచ్చిన సూచనల మేరకు సామాజిక స్పృహ ఉండే సినిమాలు తీసేందుకు కృషి చేస్తానన్నారు. పేదరికంలో ఉండి చదువుల్లో రాణిస్తున్న పలువురు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.10వేల లెక్కన చెక్కులను అందించారు. పలు పోటీల్లో విజేలైన వారికి జ్ఞాపికలు అందజేశారు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top