ఆ పెట్టది రోజుకో రకం ‘ఎగ్‌’స్ట్రా..

Hen Givens Different Size Eggs in East Godavari - Sakshi

తూర్పుగోదావరి, గొల్లప్రోలు (పిఠాపురం): మండలంలోని చినజగ్గంపేటలో శీరం సత్తిబాబు పెంచుతున్న ఓ నాటు కోడిపెట్ట పెడుతున్న గుడ్లను చూస్తుంటే..శుక్లపక్షంలో చందమామ దినదిన ప్రవర్ధమానమైన చందంగా ఉంది. గత అయిదురోజులుగా ఆ పెట్ట పెట్టే గుడ్ల సైజు రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. మొదటి రోజు చిన్న గుడ్డును పెట్టిన ఆ పెట్ట మర్నాడు దాని కన్నా కొంచెం పెద్దదిగా ఉన్న గుడ్డును పెట్టింది. తర్వాత మూడురోజులు పెట్టిన గుడ్ల సైజు కూడా కొంచెం కొంచెం పెద్దదవుతూ వచ్చింది. ఈ గుడ్లు ఊరివారికి ఆసక్తి కలిగిస్తున్నాయి. జన్యుపరమైన లోపం వల్లే కోడిపెట్టలు వివిధ సైజులలో గుడ్లు పెడుతుంటాయని పశువైద్యాధికారి హిమజ తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top