
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతొంది.
తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతొంది. సాయంత్రం ఆరు గంటల వరకు 58,946 మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర
స్వామిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 30 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 12 గంటలు, కాలిబాట భక్తులకు 7 గంటల తర్వాత స్వామి దర్శనం లభిస్తోంది.