తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది.
తిరుమల : తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. 31 కంపార్ట్మెంట్లు నిండి భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 14 గంటలు, కాలినడక భక్తులకు 10 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. కాగా నిన్న 82,610 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. కాగా ఈరోజు శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం, రేపు ఉట్లోత్సవం జరుగనుండటంతో.. పలు ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు.