నేడు ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు | Heavy rains in the AP North Coastal Areas On Thursday | Sakshi
Sakshi News home page

నేడు ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు

Sep 26 2019 4:20 AM | Updated on Sep 26 2019 4:20 AM

Heavy rains in the AP North Coastal Areas On Thursday - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఉత్తర కోస్తా తీరంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గురువారం భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం పేర్కొంది. రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని బుధవారం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం దక్షిణాంధ్ర పరిసర ప్రాంతాల మీదుగా కర్ణాటక, రాయలసీమ, తెలంగాణపై ఆవరించి ఉందని తెలిపింది. 

Advertisement
 
Advertisement
Advertisement