
పశ్చిమ గోదావరి : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఎగువన పడుతున్న వర్షాలతో జల్లేరు, బైనేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు నీటమునిగిపోయాయి. భారీ వర్షాలతో వాగులు, చెరువులు పొంగిపోవడంతో ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రానున్న 24 గంటల్లో భారీ వర్ష సూచన ఉండడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో అర్థరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.