అభం శుభం తెలియని చిన్నారి పై ఓ మైనర్ బాలుడు
పొన్నూరు(గుంటూరు): అభం శుభం తెలియని చిన్నారి పై ఓ మైనర్ బాలుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కట్టెంపుడి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఐదేళ్ల చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో అదే గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి కొండమూది సంపత్(16) బిస్కెట్ కొనిస్తానని తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
అనంతరం పాపను అక్కడే వదిలేసి వెళ్లడంతో.. ఎడ్చుకుంటూ ఇంటికి చేరిన చిన్నారిని కుటుంబ సభ్యులు ఏం జరిగిందని అడగడంతో.. చిన్నారి జరిగిన విషయం చెప్పింది. దీంతో కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.