ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై స్పష్టత ఇవ్వండి: సుజయకృష్ణ | Govt should give clarity on Fee reimbursement, says Sujaya Krishna | Sakshi
Sakshi News home page

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై స్పష్టత ఇవ్వండి: సుజయకృష్ణ

Sep 6 2014 2:51 AM | Updated on Sep 5 2018 9:18 PM

రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయం తక్షణమే తేల్చాలని వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు సుజయకృష్ణ రంగారావు డిమాండ్ చేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు సుజయకృష్ణ డిమాండ్
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ విష యం తక్షణమే తేల్చాలని వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు సుజయకృష్ణ రంగారావు డిమాండ్ చేశారు. శాసనసభలో శుక్రవారం బడ్జెట్‌లో వివిధ శాఖలకు కేటాయించిన పద్దులపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఫీజు ఎవరు చెల్లిస్తారో తెలియక, తాము చెల్లించుకోలేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని, మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు.
 
 పాత బకాయిలతో కలిపి ఈ ఏడాది రూ.3900 కోట్లు అవసరమైతే రూ.2100 కోట్లే బడ్జెట్‌లో కేటాయించారని, దీంతో ఎవరికి రీయింబర్స్ చేస్తారో చెప్పాలని కోరారు. హైదరాబాద్‌లో చదువుతున్న 21 బీసీ కులాల విద్యార్థులను గుర్తించలేమంటూ టీ సర్కార్ జీవో నెం.3 జారీ చేసిందని, వీరిలో తూర్పు కాపులు, కొప్పుల వెలమలు ఉన్నారని, వీరికి ఎలా న్యాయం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ స్కూళ్ల టీచర్లకు సర్వీస్ రూల్స్ లేక జీపీఎఫ్ కూడా వర్తించడం లేదన్నారు. కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య అంటున్న సర్కారు ప్రైవేటు స్కూళ్ల విద్యార్థుల ఫీజులపైనా స్పష్టత ఇవ్వాలన్నారు. అంగన్‌వాడీలకు వేతనం పెంచాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement