బాలిక కిడ్నాప్.. విడుదల | girl kidnapped released in Rajahmundry | Sakshi
Sakshi News home page

బాలిక కిడ్నాప్.. విడుదల

Oct 9 2014 12:41 AM | Updated on Sep 2 2017 2:32 PM

బాలిక కిడ్నాప్.. విడుదల

బాలిక కిడ్నాప్.. విడుదల

రాజమండ్రికి చెందిన బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు నల్లజర్ల మండ లం ప్రకాశరావుపాలెం వద్ద వదలి వెళ్లిన ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. అనంతపల్లి ఎస్సై ఆకుల రఘు తెలిపిన వివరాల ప్రకారం

 నల్లజర్ల రూరల్ :రాజమండ్రికి చెందిన బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు నల్లజర్ల మండ లం ప్రకాశరావుపాలెం వద్ద వదలి వెళ్లిన ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. అనంతపల్లి ఎస్సై ఆకుల రఘు తెలిపిన వివరాల ప్రకారం... రాజమండ్రి ఆల్‌కట్ గార్డెన్స్‌లోని శ్రీహర్షవర్ధన ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో నర్సరీ చదువుతున్న పందిరి మోహన కృష్ణశ్రీ అలియూస్ మేఘన (4) బుధవారం సాయంత్రం కిడ్నాప్‌నకు గురైంది. సాయంత్రం 4.30 గంటల సమయంలో మేఘనను ఇంటికి తీసుకెళ్లేందుకు తల్లి శ్రీదేవి కాన్వెంట్‌కు చేరుకోగా, అప్పటికే బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు తాము మేఘన మేనమావలమని చెప్పి బాలికను ఎత్తుకుపోయూరు. సాయంత్రం బాలిక తండ్రికి ఫోన్‌చేసిన దుండగులు రూ.2 లక్షలు డిమాండ్ చేశారు. సొమ్మును గౌతమి ఘాట్ వద్దకు తీసుకురావాలని, పోలీసులకు చెబితే పిల్లను చంపేస్తామని బెదిరించారు.
 
 ఆ తల్లిదండ్రులు సాహసించి పోలీసులను ఆశ్రయించారు. విషయం వివిధ టీవీ ఛానళ్లలో ప్రసారం కావడంతో తమ పన్నాగం బట్టబయలయ్యే ప్రమాదం ఉందని భావించిన కిడ్నాపర్లు బాలికను తాడేపల్లిగూడెం-నల్లజర్ల రహదారిలో ప్రకాశరావుపాలెం హైస్కూల్ వద్ద వదిలి వెళ్లిపోయారు. ఇదే విషయూన్ని వారి తల్లిదండ్రులకు ఫోన్‌చేసి చెప్పగా, వారు పోలీసులకు సమాచారం అందించారు. అనంతపల్లి ఎస్సై రఘు అక్కడికి వెళ్లి బాలి కను తీసుకొచ్చారు. బాలిక తల్లి శ్రీదేవిది నల్లజర్ల మండలం శింగరాజుపాలెం. ఆమె అక్క నవరాగిణి నల్లజర్లలోని ఓ షాపులో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. తెలుసున్న వ్యక్తులే బాలికను కిడ్నాప్ చేసి ఉంటారని భావిస్తున్నారు. బాలిక తండ్రి సాంబశివమూర్తి సీతానగరంలోని ప్రభుత్వ జూని యర్ కళాశాలలో ఎకనామిక్స్ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement