జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు అనాగరికం: గంటా | ganta srinivasa rao condemns jagadesh reddy comments | Sakshi
Sakshi News home page

జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు అనాగరికం: గంటా

Dec 31 2014 11:54 AM | Updated on Sep 2 2017 7:02 PM

జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు అనాగరికం: గంటా

జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు అనాగరికం: గంటా

తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలను మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. జగదీశ్ రెడ్డి ...

హైదరాబాద్ : తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలను మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు సరికావని, ఆయన వాడిన పదాలు అనాగరికంగా ఉన్నాయన్నారు. విద్యార్థుల భవిష్యత్ కోసం రెండడుగులు వెనక్కి వేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం ఏపీ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఓ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా ఉండి అలా మాట్లాడటం సరికాదని అన్నారు.

ఎంసెట్ను ఉమ్మడిగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని, సమస్యను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని, అక్కడ కూడా పరిష్కారం కాకపోతే కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి గంటా అన్నారు. ఇంటర్ పరీక్షల నిర్వహణలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఇలాగే వ్యవహరించిందన్నారు. తెలంగాణ ఉన్నత విద్యామండలికి గుర్తింపు లేదని...ఇక పరీక్షలు ఎలా నిర్వహిస్తారని మంత్రి ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement