హమ్మయ్యా..గండం గడిచింది

Food Poison Victims Discharged - Sakshi

ఊపిరి పిల్చుకున్న కలుషిత పానకం బాధితులు

ఆసుపత్రుల నుంచి డిశ్చార్జీ

ఎ.కొండూరు (తిరువూరు) : శ్రీరామనవమి కల్యాణోత్సవాల్లో కలుషిత పానకం సేవించి అస్వస్థతకు గురైన 313 మంది కోలుకున్నారు. వీరంతా నాలుగు రోజులుగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. వీరి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో అధికారులు వీరిని ప్రైవేటు బస్సుల్లో వా రివారి ఇళ్లకు చేర్పించారు. ఎవ్వరికి ఎటువంటి ప్రాణనష్టం జరుగకపోవడంతో అందరూ ఊపరిపీల్చుకున్నారు. నాలు గు రోజుల నుంచి తిరువూరులో 94,  విజయవాడ ఆంధ్రా ఆసుపత్రిలో 72 మంది,  నూజివీడులో 75 మంది, మైలవరంలో 60 మంది, ఎ.కొండూరులో  12 మంది చికిత్సపొందారు. ప్రస్తుతం కోలుకున్న 135 మంది బాధితులను  ఆసుపత్రుల నుంచి  డిశ్చార్జ్‌  చేశారు. మండలంలో ని మాత్రీయ తండా, చైతన్య నగర్‌ తండాల్లో సుమారు 600 మంది జనాభాలో  సగం మంది అస్వస్థతకు గురయ్యారు.

పారిశుద్ధ్య పనులు ముమ్మరం
తహసీల్దార్‌ సురేష్‌కుమార్‌ ఆదేశాల మేరకు ఉదయం నుంచి తండాల్లో పారిశుద్ద్య పనులు చేపట్టారు. బ్లీచింగ్‌ చల్లి దోమల మందు పిచికారీ చేశారు.  15 రోజుల వరకు  మాంసం క్రయ, విక్రయాలు జరపరాదని మైక్‌ ప్రచారం నిర్వహించారు. ఆరోగ్య విషయంలో  ఎటువంటి తేడాలున్నా తహశీల్దార్‌ కార్యాలయానికి సమాచారం అందించాలని స్థానికులకు అధికారులు సూచించారు.  రెండు తండాల్లో  వైద్య శిబిరాలు  ఏర్పాటుచేసి  అవసరమైన వారికి  చికిత్సలు చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు. ఆర్వో ప్లాంట్‌ ద్వారా  సరఫరా  చేస్తున్న  తాగునీటిని మాత్రమే తాగాలని తహసీల్దార్‌ సూచించారు. ఎ.కొండూరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో చికిత్స పొందుతున్న బాధితులకు  పండ్లు పంపిణీచేశారు.  పానకాన్ని ల్యాబ్‌కు పంపించామని నివేదిక  వచ్చిన తర్వాత నిర్థారిస్తారని అధికారులు తెలిపారు.

గిరిజన సంక్షేమాధికారి పరామర్శ
మైలవరం: కల్తీ పానకం తాగి అనారోగ్యానికి గురై మైలవరం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను గిరిజన సంక్షేమ శాఖ సహాయాధికారి టి. రమేష్‌ గు రువారం  పరామర్శించారు. బాధితుల నుంచి వివరా లు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో లభిస్తున్న వైద్య సౌకర్యాలు తెలుసుకుని నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామన్నా రు.  లంబాడీ హక్కుల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి హంసావత్‌ భోజ్యానాయక్‌ పాల్గొన్నారు. 

బాధితులకు ఎమ్మెల్యేల పరామర్శ
నూజివీడు, ఎ.కొండూరు:కలుషిత పానకం సేవించి నూజివీడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను గురువారం తిరువూరు ఎమ్మెల్యే కె. రక్షణనిధి, నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు పరామర్శించారు. వారు మాట్లాడుతూ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. పూర్తిగా తగ్గే వరకు  చికిత్సలు చేసి  డిశ్చార్జ్‌ చేయాలని చెప్పారు.  వైఎస్సార్‌ సీపీ       రాష్ట్ర కమిటీ సభ్యుడు నరెడ్ల వీరారెడి తదితరులు  పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top