అగ్నిప్రమాదంలో వేరుశెనగ వాము దగ్ధం | Fire accident in Ground nut crop | Sakshi
Sakshi News home page

అగ్నిప్రమాదంలో వేరుశెనగ వాము దగ్ధం

Dec 4 2015 6:07 PM | Updated on Sep 5 2018 9:45 PM

చేతికొచ్చిన పంటను సొమ్ము చేసుకోకముందే అగ్నికి ఆహుతయ్యింది. ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు వేరుశెనగ వాముకు అంటుకోవడంతో.. కాయలన్నీ కాలి బూడిదయ్యాయి.

శెట్టూరు (అనంతపురం) : చేతికొచ్చిన పంటను సొమ్ము చేసుకోకముందే అగ్నికి ఆహుతయ్యింది. ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు వేరుశెనగ వాముకు అంటుకోవడంతో.. కాయలన్నీ కాలి బూడిదయ్యాయి. దీంతో సుమారు రూ. 2 లక్షల నష్టం వాటిల్లింది. ఈ ఘటన అనంతపురం జిల్లా శెట్టూరు మండలం లింగబీర్లపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బుడ్డయ్య అనే రైతు తన వేరుశెనగ పంటను వాము వేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో వాము పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement