ఫన్‌జోన్‌లో మంటలు

Fire Accident in Fun Zone East Godavari - Sakshi

విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో ప్రమాదం

రూ.10 లక్షల ఆస్తి నష్టం

మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది

తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: నగరంలో రంభ థియేటర్‌ పక్కన ఏర్పాటు చేస్తున్న ఫన్‌ జోన్‌లో మంటలు వ్యాపించాయి. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది శుక్రవారం మధ్యాహ్నం   భోజనాలకు వెళ్లిన సమయంలో ఈ మంటలు వ్యాపించాయి. దాన్ని గమనించిన సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన తరలివచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ఫన్‌జోన్‌కోసం థియేటర్‌ పక్కన ఉన్న స్థలంలో పిల్లలు అడుకునేందుకు ఫైబర్‌ బొమ్మలు, ప్లాస్టిక్‌ పరికరాలు, కంప్యూటర్‌ వీడియో గేమ్‌లు  ఏర్పాటు చేశారు. కంప్యూటర్‌ నుంచి విద్యుత్‌ షార్టుసర్క్యూట్‌ కావడంతో మంటలు వ్యాపించాయి. ఇది గమనించిన  సిబ్బంది మ్యాట్నీ ఆటను రద్దు చేసి ప్రేక్షకులకు టికెట్‌ డబ్బులు ఇచ్చివేసి బయటకు పంపించి వేశారు. ఈ అగ్నిప్రమాదంలో సుమారు రూ. 10 లక్షల వరకూ ఆస్తినష్టం సంభవించినట్టు నిర్వాహకులు తెలిపారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top