పొట్టకూటికోసం వెళ్లి.. తిరిగిరాని లోకాలకు | Father and son killed in a fall from train | Sakshi
Sakshi News home page

పొట్టకూటికోసం వెళ్లి.. తిరిగిరాని లోకాలకు

May 29 2015 12:07 AM | Updated on Aug 16 2018 4:21 PM

పొట్టకూటికోసం వెళ్లి.. తిరిగిరాని లోకాలకు - Sakshi

పొట్టకూటికోసం వెళ్లి.. తిరిగిరాని లోకాలకు

విధి బలీయమైనది. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం కొండకెంగువకు చెందిన అగతాని వెంకటరావు కుటుంబం ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది.

- రైలునుంచి జారిపడి తండ్రీకొడుకుల దుర్మరణం
- మృతులు విజయనగరం జిల్లా దినసరి కూలీలు
- గుల్లిపాడు రైల్వేస్టేషన్ సమీపంలో ఘటన

నక్కపల్లి:
విధి బలీయమైనది. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం కొండకెంగువకు చెందిన అగతాని వెంకటరావు కుటుంబం ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. పొట్టకూటికోసం వెళ్లి స్వగ్రామానికి తిరిగి వస్తూ మరో నాలుగు గంటల్లో సొంతూరుకి చేరుకునే సమయంలో వెంకటరావు, కొడుకు నవీన్ రైలు నుంచి జారిపడి దుర్మరణం పాలయ్యారు. కళ్లముందే భర్త అందివచ్చిన కొడుకు చనిపోవడాన్ని భార్య బంగారమ్మ జీర్ణించుకోలేకపోతోంది. మతి స్థిమితం కోల్పోయిన దానిలా మాట్లాడుతూ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఫోన్‌లో బంధువులకు వివరాలు చెప్పడానికి  కూడా ఆమె నోటి మాట రావడంలేదు. ఇది అక్కడివారినందరినీ కంటతడి పెట్టిం చింది.

వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గుల్లిపాడు రైల్వేస్టేషన్ సమీపంలో గురువారం తెల్లవారుజామున రైలునుంచి జారిపడి తండ్రీకొడుకులు దుర్మరణం పాలయ్యారు. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం కొండకెంగువ గ్రామానికి చెందిన అగతాని వెంకటరావు(47) ముగ్గురు పిల్లలు, భార్యతోకలసి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని జొన్నాడలోని ఇటుకల తయారీ పరిశ్రమలో పనికి రెండు నెలల క్రితం వెళ్లారు. అక్కడ పనులు ముగిశాక స్వగ్రామానికి వస్తూ బుధవారం రాత్రి రాజమండ్రిలో రెలైక్కారు. రద్దీగా ఉండడంతో భార్య, ఇద్దరు పిల్లల్ని కంపార్టుమెంటు మధ్యలో కూర్చోబెట్టి వెంకట్రావు, పెద్ద కొడుకు నవీన్(17) గేటు వద్ద కూర్చున్నారు.

తెల్లవారుజాము కావడంతో నిద్రమత్తులో వెంకటరావు కుమారుడు నవీన్(17) జారిపడ్డాడు. అతడ్ని రక్షించే ప్రయత్నంలో వెంకట్రావు కూడా పడిపోయాడు. ఈ ఘటనలో ఇరువురి మృతదేహాలు తునాతునకలయ్యాయి. గుర్తుపట్టలేని విధంగా తయారయ్యా యి. రైలులోని వారు ఈ విషయం భార్య బంగారమ్మకు చెప్పడంతో ఆమె తనవద్ద ఉన్న ఇద్దరు చిన్నపిల్లలతో నర్సీపట్నం రోడ్డు రైల్వేస్టేషన్‌లో దిగి తుని రైల్వేస్టేషన్‌కు చేరుకుంది.

గుల్లిపాడు స్టేషన్ సిబ్బంది ఈ ఘటనపై తుని రైల్వేపోలీసులకు సమాచారం ఇచ్చారు. జీఆర్పీ ఎస్‌ఐ వై. రాంబాబు సంఘటన స్థలానికి చేరుకుని తెగిపడిన తండ్రీకొడుకుల మృతదేహాలను పరి శీలించారు. వాటిని పోస్టుమార్టానికి తు ని ఆస్పత్రికి తరలించారు. మృతుల వద్ద సెల్‌ఫోన్, రాజమండ్రి నుంచి విజ యనగరానికి తీసుకున్న రైలు టికెట్లు ఉన్నాయి. సెల్‌ఫోన్ ద్వారా బంధువులకు సమాచారం ఇచ్చారు. కేసు దర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాంబాబు తెలి పారు. నిద్రమత్తులో ప్రమాదవశాత్తూ జారిపడినట్లు తెలుస్తోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement