విద్యుదాఘాతంతో రైతు మృతి | Farmer killed by electric shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Jan 13 2016 2:11 PM | Updated on Oct 1 2018 4:01 PM

పొలంలో బోరు మోటారు ఆన్ చేయటానికి వెళ్లిన ఓ రైతు విద్యుదాఘాతంతో చనిపోయాడు.

పొలంలో బోరు మోటారు ఆన్ చేయటానికి వెళ్లిన ఓ రైతు విద్యుదాఘాతంతో చనిపోయాడు. గుంటూరు జిల్లా మాచర్ల మండలం కొత్తూరు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బండారుపల్లి హనుమయ్య(40) బుధవారం మధ్యాహ్నం తన పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. బోరు మోటారు ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని మాచర్ల ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో ప్రాణాలు విడిచాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement