జల్సాల కోసం చోరీలు.. | Engineering students arrested | Sakshi
Sakshi News home page

జల్సాల కోసం చోరీలు..

May 21 2015 5:02 AM | Updated on Sep 3 2017 2:23 AM

జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతూ ఇంజినీరింగ్ విద్యార్థులు అరెస్ట్ అయ్యారు.

ఇంజినీరింగ్ విద్యార్థులు అరెస్ట్

 ఆళ్లగడ్డటౌన్ : జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతూ ఇంజినీరింగ్ విద్యార్థులు అరెస్ట్ అయ్యారు. ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్ లో ఏఎస్‌పీ శశికుమార్ తెలిపిన వివరాల మేరకు.. రెండు నెలల క్రితం న్యాయవాది వినోద్‌కుమార్ ఇంట్లోకి వెళ్లి ఆయన భార్యను బెదిరించి.. ఆమె మెడలో ఉన్న రెండు బంగారు గొలుసులు లొక్కొని పారిపోయారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చే సుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సెల్‌ఫోన్ కాల్‌డేటా ఆధారంగా ఆళ్లగడ్డ సీఐ ఓబులేసు, ఎస్సైలు చంధ్రశేఖరరెడ్డి, సోమ్లానాయక్‌లు..నిందితులను గుర్తించారు. స్థానిక వైపీపీఎం ప్రభుత్వ కళాశాల మైదానంలో  ఉన్న మల్లిఖార్జున వీధి కి చెందిన కంప్యూటర్ ఆపరేటర్ బండారు మల్లిఖార్జున, ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు నాగేళ్ల నిఖిల్, కొమ్ము సుధీర్‌లను అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద నుంచి చోరీ చేసిన సుమారు 6 తులాల తూకం ఉన్న రెండు బంగారు గొలుసులు, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. వీరి ముగ్గురిపై కేసు నమోదు చేసి చోరీ చేసేందుకు ఉపయోగించిన రెండు మోటార్ సైకిళ్లను సీజ్ చేసి కోర్టులో హాజరు పరిచారు.

Advertisement

పోల్

Advertisement