చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం | elephants damage crops in chittoor | Sakshi
Sakshi News home page

చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం

Jun 30 2017 1:11 PM | Updated on Sep 5 2017 2:52 PM

జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి.

చిత్తూరు: జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. చిల్లగొట్టికల్లు, ఎర్రవారి పాల్యం మండలాల్లో శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఏనుగుల గుంపు వీరవిహారం చేస్తోంది. చిట్టెచర్ల, దేవరకొండ పంచాయతి పరిధిలో మామిడి, టమాట పంటలను ధ్వంసం చేస్తున్నాయి. ఏనుగుల గుంపును తరిమికొట్టడానికి గ్రామస్థులు బాణాసంచా కాలుస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అక్కడికి చేరుకొని నష్టపోయిన రైతులను పరామర్శించారు. 

Advertisement
 
Advertisement
Advertisement