damage crops
-
నేల రాలిన రైతుల ఆశలు
మామిడి రైతుల ఆశలు పూర్తిగా అడుగంటిపోయాయి. మొదట్లో నల్లతామర, మాంగో లూఫర్ వంటి పురుగుల దాడితో పూత మాడిపోయింది. ఆ తర్వాత తెగుళ్లు, చీడపీడలకు తోడు అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో పిందెలు పురుగుపట్టి రాలిపోయాయి. వాతావరణాన్ని తట్టుకుని నిలిచిన కొద్దిపాటి పిందెలు కాయ కడుతున్న వేళ విరుచుకుపడిన వర్షాలు, ఈదురు గాలులకు పూర్తిగా నేలరాలిపోయాయి. ఈదురు గాలులకు వడగండ్ల వానలు తోడవడంతో మామిడి రైతులకు అపార నష్టం వాటిల్లింది. మరోవైపు నాణ్యత లేదనే సాకుతో మార్కెట్లో ధర దక్కక రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. – సాక్షి, అమరావతి/నెట్వర్క్3 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటరాష్ట్రంలో దాదాపు 10 లక్షల ఎకరాల్లో మామిడి సాగవుతుండగా.. ఈ ఏడాది నల్లతామర, చీడపీడల ప్రభావానికి తొలుత 50 శాతానికి మించి దిగుబడులొచ్చే అవకాశాలు లేవని సీజన్ ప్రారంభంలోనే అంచనా వేశారు. ప్రస్తుతం 50 శాతం వచ్చే పరిస్థితి కూడా కని్పంచడం లేదు. రాయలసీమ జిల్లాల్లో ఎకరాకు 2–3 టన్నుల మధ్య దిగుబడులొస్తాయని అంచనా వేయగా.. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశి్చమ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో టన్నున్నర రావడం కూడా కష్టంగా ఉందని చెబుతున్నారు.ఈ నెల 7, 8 తేదీల్లోనూ, తిరిగి 13, 14 తేదీల్లోనూ వరుసగా ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు కురవడంతో దాదాపు 3 లక్షల ఎకరాల్లో కాయలు నేల రాలినట్టు అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్, కృష్ణా, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఈ నష్టం ఎక్కువగా వాటిల్లినట్టు చెబుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోనే 50వేల ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న మామిడికాయలు నేలరాలినట్టుగా అంచనా వేశారు.రాష్ట్రంలోనే అత్యధిక విస్తీర్ణంలో మామిడి తోటలున్న ఈ జిల్లాలో దాదాపు 1.76 లక్షల టన్నుల కాయల దిగుబడులొస్తాయని అంచనా వేయగా.. చివరకు 50వేల టన్నులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. కృష్ణా జిల్లాలో మరో 30–40 వేల ఎకరాల్లో మామిడి నేలరాలగా.. అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో దాదాపు వెయ్యి ఎకరాల్లో మామిడి పంట ఈదురుగాలులకు దెబ్బతిన్నట్టు అంచనా వేశారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కనీసం 25–35 శాతం కూడా దిగుబడులొచ్చే అవకాశాలు కనిపించడం లేదని అధికారులే చెబుతున్నారు. ధరలూ అంతంతే మామిడి కాయల్లో నాణ్యత లేదనే కారణంతో ఈసారి ఆశించిన ధరలు కూడా లభించని పరిస్థితి నెలకొంది. నూజివీడు రసాలు టన్ను రూ.10 వేల నుంచి రూ.15వేల మధ్య పలుకుతుండగా.. బంగినపల్లి రూ.15 వేల నుంచి రూ.45 వేల మధ్య పలుకుతున్నాయి. రాయలసీమ జిల్లాల్లో పండే అల్పాన్స్ రకాలకు మాత్రమే నాణ్యతను బట్టి అత్యధికంగా రూ.95 వేల వరకు ధర లభిస్తోందని చెబుతున్నారు. రాయలసీమలో ఈ స్థాయి ధరలు పొందే రైతులు నూటికి 10 శాతం మంది కూడా ఉండరని చెబుతున్నారు.పంటల బీమాకు దూరంఈదురు గాలుల వల్ల లక్షలాది ఎకరాల్లో కాయలు నేలరాలినప్పటికీ నిబంధనల సాకుతో అధికారులు పంట నష్టాన్ని ప్రాథమికంగా కూడా గుర్తించడం లేదు. మరోవైపు రబీలో చివరి నిముషంలో పంటల బీమా వర్తింప చేసినా గడువు తక్కువగా ఉండటం, ప్రీమియం భారం అధికంగా ఉండటంతో రైతులెవరూ బీమా చేయించుకోలేకపోయారు. ఫలితంగా ఏ ఒక్కరికీ బీమా పరిహారం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.ఈదురు గాలులు దెబ్బతీశాయి ఈ ఏడాది పూత చాలా ఆలస్యంగా వచి్చంది. పూతను కాపాడుకోవడానికి నానాతంటాలు పడ్డాం. అప్పులు తెచ్చి 13 ఎకరాలకు మందులు పిచికారీ చేశాం. దిగుబడి పర్వాలేదనుకుంటున్న తరుణంలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పంటను దెబ్బతీశాయి. గడచిన రెండ్రోజుల్లో కురిసిన వర్షానికి 13 ఎకరాల్లో పిందె దశలో ఉన్న మామిడి చాలావరకు నేలరాలింది. మిగిలిన కొద్దిపాటి కాయలైనా చేతికొస్తాయో లేదో తెలియడం లేదు. ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకోవాలి. – నాయనిరెడ్డి, వెజ్జుపల్లి, చిత్తూరు జిల్లా చేతికందే దశలో పంట పోయింది నేను మూడెకరాల మామిడి తోట కౌలుకు తీసుకున్నాను. సొంతంగా ఎకరం తోట ఉంది. సీజన్ ప్రారంభంలో తేనె మంచు, వాతావరణం అనుకూలించక కాపు తగ్గింది. పురుగు మందులకు ఎకరానికి రూ.45 వేలు ఖర్చు చేశాను. ఎండ తీవ్రతకు 20 శాతం పిందెలు, కాయలు రాలిపోయాయి. మామిడి కాయలు చేతికి వస్తాయనుకుంటున్న తరుణంలో అకాల వర్షం, ఈదురు గాలులకు పంట నష్టం వాటిల్లింది. సగం పంట రాలిపోయింది. ప్రభుత్వం ఆదుకోవాలి. – గండి రమణ, రైతు, తుని, కాకినాడ జిల్లా -
అకాల వర్షం.. అపార నష్టం
రాయచోటి: జిల్లా పరిధిలో ఆదివారం సాయంత్రం అకాలంగా వచ్చిన వర్షం మామిడి, అరటి, ఇతర పండ్లతోటలకు భారీ నష్టాన్ని చేకూర్చింది. ఉన్నట్టుండి ఈదురుగాలులతో కూడిన వర్షం అధికంగా కురవడంతో మామిడి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సుండుపల్లి, పీలేరు, రైల్వేకోడూరు, కేవీపల్లి మండలాల పరిధిలో మామిడి చెట్లు వేర్లతో సహా పెకలింపబడ్డాయి. రాయచోటి, చిన్నమండెం, వీరబల్లి తదితర మండలాల్లో మామిడి కాయలు భారీగా నేలరాలాయి. రైల్వే కోడూరులో 35 హెక్టార్లకు పైగా అరటి తోటలు దెబ్బతినగా, జిల్లా వ్యాప్తంగా 500 హెక్టార్లలో మామిడి తోటలు దెబ్బతిన్నట్లు జిల్లా ఉద్యానవన అధికారి రవీంద్రారెడ్డి తెలిపారు. జరిగిన నష్టంపై సోమవారం ఆయా ప్రాంతాల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికల రూపంలో ప్రభుత్వానికి తెలియపరుస్తామన్నారు. రెండు ప్రాంతాల్లో పిడుగు జిల్లా పరిధిలోని వీరబల్లి మండలం ఈడిగ పల్లెలో, సుండుపల్లి ప్రాంతాల్లో టెంకాయచెట్లపై పిడుగు పడి దగ్ధమయ్యాయి. ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు తెగిపోవడం, స్తంభాలు నేలకూలడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అకాలంగా కురిసిన వర్షాలకు మామిడి, అరటి తోటల్లో నష్టం అధికం కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
గులాబ్ ఎఫెక్ట్: పంట చేలు.. కన్నీళ్లు
సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్: గులాబ్ తుపాను వల్ల కురిసిన భారీ వర్షంతో రాష్ట్రంలోని పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. వాగులు, వంకలు పొంగడంతో అనేక ప్రాంతాలను వరద ముంచెత్తింది. రాష్ట్రవ్యాప్తంగా 2.20 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. అయితే ఇంతకుమించి వేలాది ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు అనధికార సమాచారం. నిజామాబాద్, సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, పెద్దపల్లి, ములుగు, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగినట్టుగా అంచనా వేసినట్లు సమాచారం. ఇతర జిల్లాల్లో మోస్తరు నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. మొత్తంగా ఈ వానాకాలంలో ఇప్పటివరకు 12.80 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినటు సమాచారం. కాగా తాజా వర్షాలతో వరి, పత్తి, సోయా, మొక్కజొన్న, పొగాకు, పసుపు పంటలు దెబ్బతిన్నాయి. రహదారులపై వరద ప్రవాహంతో రాకపోకలు స్తంభించాయి. కొన్నిచోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 35 వేలకు పైగా చెరువులు నిండినట్లు సమాచారం. కాగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో పరిస్థితి సమీక్షించి, సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. నిజామాబాద్‌లో అత్యధిక సగటు వర్షపాతం నిజామాబాద్ జిల్లాలో సోమవారం 20.4 సెంటీమీటర్ల అత్యధిక సగటు వర్షపాతం నమోదయ్యింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన గోదావరి, మంజీర పరీవాహక ప్రాంతాల్లోని బోధన్, నవీపేట, నందిపేట మండలాల్లో పంటలు భారీగా నీటమునిగాయి. జిల్లాలో 7,943 ఎకరాల్లో వరి, 1,551 ఎకరాల్లో సోయా, 402 ఎకరాల్లో మొక్కజొన్న, 250 ఎకరాల్లో పొగాకు పంటలు దెబ్బత్నిట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. చెరువులు భారీగా పొంగి ప్రవహిస్తుండడంతో అనేక చోట్ల లోలెవల్ వంతెనల పైనుంచి నీరు ప్రవహించింది. డిచ్పల్లి మండలం సుద్దపల్లి తండా చెరువులో పడి ఒకరు మృతి చెందారు. నీట మునిగిన బాసర బైపాస్ వంతెన భీమ్‌గల్ మండలం గోన్‌గొప్పుల్ వద్ద బోరపు వాగు బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తున్న వరదలో భారత్ గ్యాస్‌కు చెందిన 200 నిండు సిలిండర్లతో ఉన్న లారీ కొట్టుకుపోయింది. డ్రైవర్‌ను పోలీసులు, స్థానికులు రక్షించారు. ముత్తకుంట గ్రామ శివా రులో లోలెవల్ వంతెనపై ప్రవహిస్తున్న వరదలో లారీ చిక్కుకుపోగా అందులోని ఏడుగురు కూలీ లను గ్రామస్తులు రక్షించారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, జెడ్పీ చైర్మన్ విఠల్‌రావు పలు ప్రాంతాల్లో పర్యటించారు. నిజాంసాగర్ గేట్ల ఎత్తివేత కామారెడ్డి జిల్లాలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా జుక్కల్‌లో 14.9 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌తో వందలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. ప్రాజెక్టుకు భారీ వరద వస్తుండడంతో గేట్లన్నీ ఎత్తి నీటిని దిగువకు వదిలారు. కామారెడ్డి పట్టణానికి సమీపంలోని లింగాపూర్‌లో మంగళవారం పందిరి భగవాన్‌రెడ్డి (54) అనే రైతు మోపెడ్‌పై కూరగాయలు విక్రయిం చి తిరిగివస్తూ వరదలో కొట్టుకుపోయాడు. గ్రామస్తులు గాలించగా మృతదేహం లభించింది. నిర్మల్‌కు మళ్లీ వాన దెబ్బ రెండునెలల క్రితమే జడివానతో దెబ్బతిని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నిర్మల్ జిల్లాను గులాబ్ తుపాన్ మళ్లీ దెబ్బకొట్టింది. వేల ఎకరాల్లో పంటను వరద ముంచెత్తింది. గోదావరి, స్వర్ణ, కడెం, సుద్ధవాగులు పోటెత్తడంతో తీరప్రాంతాల్లో పంటలకు భారీగానే నష్టం వాటిల్లింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 33 గేట్లు ఎత్తడంతో దిగువన గల సోన్, లక్ష్మణచాంద, మామడ, ఖానాపూర్, కడెం, దస్తురాబాద్ మండలాల్లోని వందల ఎకరాల్లో పంటపొలాలు నీటమునిగాయి. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ నిలిచే ప్రాంతంలో కూడా పంటలు నీట మునిగాయి. ఎస్సారెస్పీ నుంచి 4 లక్షల క్యూసెక్కులు విడుదల శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి మంగళవారం ఉదయం వరద ఉధృతి పెరి గింది. దీంతో 33 వరద గేట్ల ద్వారా 4 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నా రు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 (90 టీఎం సీలు) అడుగులు కాగా మంగళవారం సాయంత్రానికి 1088.90 అడుగుల వద్ద 79 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. ట్రాక్టర్‌పై బయటకు వచ్చిన కలెక్టర్ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ మరోసారి వరద నీటిలో చిక్కింది. కలెక్టరేట్ భవనం పక్కనే ఉన్న క్యాంపు ఆఫీస్‌లో కలెక్టర్ అనురాగ్ జయంతి నివాసం ఉంటున్నారు. ఆయన మంగళవారం ఉదయం సిరిసిల్ల పట్టణంలో లోతట్టు ప్రాంతాల్లో వరదలను పరిశీలించడంతో పాటు బాధితుల పరామర్శకు సిద్ధమయ్యారు. కానీ చుట్టూ వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో కారులో బయటకు రావడం సాధ్యం కాలేదు. దీంతో ట్రాక్టర్ తెప్పించుకుని బయటకు వచ్చి పట్టణంలో పర్యటించారు. రాష్ట్రంలో 50.6 మి.మీ సగటు వర్షపాతం సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు రాష్ట్రంలో సగటున 50.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 4.5 మి.మీ కాగా రోజంతా కురిసిన వానతో కొత్త రికార్డు నమోదైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలోని జాక్రాన్పల్లిలో 228.9 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఎగువున కురిసిన వర్షాలతో హైదరాబాద్‌లోని హిమాయత్‌సాగర్, ఉస్మాన్సాగర్లు నిండుకున్నాయి. గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదలడంతో మూసి పొంగి పొర్లుతోంది. భద్రాచలం వద్ద పెరుగుతున్న నీటిమట్టం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తాలిపేరు 9 గేట్లను ఎత్తి వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టులోకి 11వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ప్రస్తుతం 32.1 అడుగులకు చేరుకుంది. దుమ్ముగూడెం మండలం పర్ణశాలలో నీట మునిగిన సీతమ్మ విగ్రహం నీట మునిగింది. రెండురోజులు తేలికపాటి వర్షాలు వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మంగళవారం అల్పపీడనంగా మారింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉంది. బుధ, గురువారాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ఇలావుండగా సోమవారం నాటి వాయుగుండం పశ్చిమ–వాయవ్య దిశగా కదిలి మంగళవారం విదర్భ పరిసర ప్రాంతాల్లో నాగపూర్‌కు నైరుతి దిశగా 250 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతోంది. బుధవారం ఉదయం నాటికి మరింత బలహీనపడనుంది. ఇంజనీర్లు అప్రమత్తంగా ఉండాలి: స్పెషల్ సీఎస్ రాష్ట్రంలో వరద పరిస్థితులను ఇరిగేషన్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్‌కుమార్ మంగళవా రం ఇంజనీర్లతో సమీక్షించారు. క్షేత్రస్ధాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వైద్య సిబ్బంది సెలవులు రద్దు భారీ వర్షాల నేపథ్యంలో వైద్య సిబ్బంది సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపా రు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి సెలవు మంజూరు చేయకూడదని జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు. అవసరమైన చోట్ల జ్వర సర్వే చేపట్టాలన్నారు. నర్సింగ్, పారా మెడికల్ సిబ్బంది తమ పరిధిలో క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని సూచించారు. హెచ్ఎండీఏలో ప్రత్యేక బృందాలు హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీల పరిధిలో ఉన్న 185 చెరువులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రభుత్వం 15 మంది ఇంజనీర్లతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసింది. అలాగే వరద పరిస్థితులపై ఫిర్యాదులకు జలసౌధ కంట్రోల్ రూమ్‌లో 040–23390794 నంబర్ ఏర్పాటు చేసింది. అంత్యక్రియల్లో పాల్గొని, స్నానానికి వెళ్లి.. హనుమకొండ జిల్లా నడికూడ మండలం నార్లాపూర్ గ్రామంలో వాగులో పడి గ్రామానికి చెందిన ఈర్ల అభినవ్ (22), ఈర్ల కౌశిక్ (22) మంగళవారం గల్లంతయ్యారు. అదే గ్రామానికి చెందిన కొమురయ్య సోమవారం రాత్రి చనిపోగా.. మంగళవారం అంత్యక్రియల్లో పాల్గొన్న అనంతరం వాగులో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ కొట్టుకుపోయారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కోతకు గురైన అప్పా చెరువు కట్ట భారీ వర్షాలకు హైదరాబాద్ నగర శివారులోని ‘అప్పా’చెరువు కట్ట రెండు ప్రాంతాల్లో కోతకు గురైంది. పలు లోతట్టు ప్రాంతాలతో పాటు బెంగళూరు జాతీయ రహదారిపై వరద నీరు చేరింది. నిజామాబాద్ జిల్లా ముత్తకుంట గ్రామ శివారులో లోలెవల్ వంతెనపై ప్రవహిస్తున్న చెరువు అలుగు నీటి వరదలో లారీ చిక్కుకు పోగా అందులోని ఏడుగురు కూలీలను గ్రామస్తులు తాడు సహాయంతో రక్షించారు. -
‘పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది’
సాక్షి, తాడేపల్లి: పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర, కృష్ణా, గోదావరి జిల్లాల్లో పంటనష్టం జరిగిందని, పంట నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులను నియమించామని తెలిపారు. ఇరిగేషన్ కాలువలను చక్కదిద్దేందుకు చర్యటు చేపట్టామని పేర్కొన్నారు. ప్రభుత్వంపై తప్పుడు విమర్శలకే టీడీపీ పరిమితమైందని మండిపడ్డారు. చదవండి: బద్వేలు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా దాసరి సుధ: సజ్జల డైవర్షన్ పాలిటిక్స్‌లో చంద్రబాబును మించినవాళ్లు లేరని ఎద్దేవా చేశారు. దుర్భిక్ష పరిస్థితుల నుంచి అనంత జిల్లా బయటపడుతోందని తెలిపారు. వాస్తవాలను పక్కదారి పట్టించేలా టీడీపీ నేతల వ్యాఖ్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు. విత్తనాల కోసం గతంలో రోజుల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి ఉండేదని అన్నారు. ప్రస్తుతం ఇంటికే విత్తనాలను అందిస్తున్నామని తెలిపారు. విత్తనాల నుంచి విక్రయం వరకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. పవన్ కల్యాణ్ ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కు వెళ్లింది పవన్ కల్యాణ్ ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కు వెళ్లిందని మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. రెండు చోట్లా ఓడిపోయాననే అవమానభారం తట్టుకోలేకపోతున్నాడని మండిపడ్డారు. సినిమా ఫంక్షన్‌కు వెళ్లి రాజకీయం మాట్లాడటం ఎంటీ? అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎనాడైనా చంద్రబాబును ప్రశ్చించారా? అని నిలదీశారు. -
నిబంధనలకు ‘పొగ’బెట్టారు!
సాక్షి,కల్లూరు: కర్నూలు సమీపంలోని భారీ పరిశ్రమలు నిబంధనలకు విరుద్ధంగా పగలు, రాత్రి అనే తేడా లేకుండా పొగలు చిమ్ముతున్నాయి. ఫలితంగా సమీపంలోని గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కల్లూరు మండల పరిధిలో పందిపాడు, లక్ష్మీపురం గ్రామాల మధ్య ఐరన్ (టీఎంటీ) పరిశ్రమ రెండు నెలల క్రితం పునః ప్రారంభమైంది. దీని నుంచి పొగ విపరీతంగా బయటకు వస్తోంది. పరిశ్రమ చుట్టూ ఉన్న పొలాలు పొగ చూరి పనికిరాకుండా పోతున్నాయి. పొగ వాసనను భరించలేక పక్కనే ఉన్న సిమెంట్ ఇటుకల పరిశ్రమకు కార్మికులు రావడం మానేశారు. టీఎంటీ పరిశ్రమకు అనుబంధంగా బాయిలింగ్ ఐరన్ పరిశ్రమ త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలిస్తోంది. ఇదే జరిగితే బాయిలింగ్ పరిశ్రమ నుంచి వచ్చే పొగ, దుమ్ము, ధూళి పైర్లపై పడి పంటలు పండే పరిస్థితులు ఉండబోవని రైతులు ఆందోళన చెందుతున్నారు. నిబంధనలు పాటించాలి పరిశ్రమల నుంచి వస్తున్న పొగ, దుమ్ము, ధూళితో వాహనదారులు, సమీప గ్రామాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి బోర్డు నిబంధనల మేరకు పరిశ్రమలను నడపాలి. నిబంధనలకు విరుద్ధంగా నడిచే పరిశ్రమలను సీజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – ఎల్లరాముడు, ఐఎఫ్టీయూ జిల్లా నాయకుడు -
‘అతి’ ఏదైనా ప్రమాదకరమే
‘అతి’ ఏదైనా ప్రమాదకరమే. ‘మితంగా’ ఉంటేనే ఉపయుక్తం. ఇప్పుడు వర్షాలదీ అదే పరిస్థితి. అవసరమున్నప్పుడు చినుకు నేలరాలదు. ఇప్పుడు వద్దు..వద్దంటున్నా వదలడం లేదు. వరుణుడి ప్రకోపానికి జనం చిగురుటాకులా వణికిపోతున్నారు. పంట పొలాలన్నీ తుడిచిపెట్టుకుపోతుండడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. వాగులు, వంకలు ఏకమై ఊళ్లను ముంచెత్తుతున్నాయి. ఎప్పుడు ఉపద్రవం ముంచుకొస్తుందోనని లోతట్టు ప్రాంత ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. తాజాగా ఆళ్లగడ్డ, మహానంది, శిరివెళ్ల, కోసిగి, రుద్రవరం తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాపై వరుణుడి ప్రకోపం తగ్గడం లేదు. కుండపోతగా వర్షిస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి కుళ్లిపోతున్నాయి. సోమవారం ఉదయం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కుండకోత వర్షాలు కురవడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. ఆళ్లగడ్డలో ఏకంగా 19 సెంటీమీటర్లు, మహానందిలో 13 సెంటీమీటర్ల వర్షాలు పడటంతో వాగులు, వంకలు, పంట పొలాలు ఏకమయ్యాయి. 41మండలాల్లో తేలికపాటి నుంచి కుండపోతగా వర్షాలు కురిశాయి. జిల్లా సగటున 22.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. అక్టోబరులో ఇప్పటి వరకు49శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. 2,577 ఇళ్లు తీవ్రంగా దెబ్బతినగా ఒక్కరోజులోనే అధిక వర్షాలకు 560 గృహాలు కూలిపోయినట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సమాచారం అందింది. నంద్యాల డివిజన్లో 357 ఇళ్లు పాక్షికంగా, 8 ఇళ్లు పూర్తిగా, ఆదోని డివిజన్లో 11 పూర్తిగా, 144 పాక్షికంగా, కర్నూలు డివిజన్లో 47 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. మట్టిమిద్దెలు పూర్తిగా కూలిపోతున్నాయి. ఆళ్లగడ్డ మండలం బత్తులూరు, నల్లగట్ల, నందిన్‌పల్లి, గూబగుండం, పేరాయిపల్లి తదితర గ్రామాలను వరద నీరు ముంచెత్తడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఆళ్లగడ్డ– అహోబిలం, కృష్ణాపురం– కోటకందుకూరు, ఓబులంపల్లి– ఆళ్లగడ్డ మధ్య వాగులకు వరద పోటెత్తడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శిరివెళ్లలో పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు జలదిగ్బందంలో ఉండిపోయాయి. తహసీల్దారు కార్యాలయం, పోలీస్ స్టేషన్, జిల్లా పరిషత్ హైస్కూల్లోకి వెళ్లేందుకే వీలు కాలేదు. రెవెన్యూ సిబ్బంది ఎంపీడీఓ కార్యాలయంలో విధులు నిర్వహించాల్సి వచ్చింది. మహానంది మండలం అబ్బీపురం, తిమ్మాపురం, గాజులపల్లి, బుక్కాపురం తదితర గ్రామాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఆళ్లగడ్డ, మహానంది, శిరివెళ్ల, రుద్రవరం, దొర్నిపాడు తదితర మండలాల్లో వేలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగి కుళ్లిపోతోంది. ఇప్పటికే వేరుశనగ, పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు అపారనష్టం వాటిల్లింది. రబీలో సాగు చేసిన శనగ సైతం కుళ్లిపోతోంది. ఇప్పటికే వ్యవసాయశాఖ 32వేల హెక్టార్లలో పంటలకు నష్టం జరిగినట్లు ప్రకటించింది. ఈ నష్టం భారీగా పెరిగే పరిస్థితి ఉంది. కర్నూలు, ఆదోని రెవెన్యూ డివిజన్లలో ఉల్లి పొలాల్లోనే కుళ్లిపోతుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. -
చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం
చిత్తూరు: జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. చిల్లగొట్టికల్లు, ఎర్రవారి పాల్యం మండలాల్లో శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఏనుగుల గుంపు వీరవిహారం చేస్తోంది. చిట్టెచర్ల, దేవరకొండ పంచాయతి పరిధిలో మామిడి, టమాట పంటలను ధ్వంసం చేస్తున్నాయి. ఏనుగుల గుంపును తరిమికొట్టడానికి గ్రామస్థులు బాణాసంచా కాలుస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అక్కడికి చేరుకొని నష్టపోయిన రైతులను పరామర్శించారు. -
చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం