విద్యుత్ చార్జీల పెంపుపై ఆందోళన | Electricity tariff hikes concern | Sakshi
Sakshi News home page

విద్యుత్ చార్జీల పెంపుపై ఆందోళన

Apr 2 2016 3:45 AM | Updated on Sep 5 2018 3:44 PM

విద్యుత్ చార్జీల పెంపుపై ఆందోళన - Sakshi

విద్యుత్ చార్జీల పెంపుపై ఆందోళన

పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని కోరుతూ సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట...........

కర్నూలు(న్యూసిటీ): పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని కోరుతూ సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు టి.షడ్రక్, జిల్లా కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ చార్జీల పెంపు రూపంలో ప్రభుత్వం ప్రజలపై అదనపు భారం మోపుతోందన్నారు. ఓ వైపు మిగులు విద్యుత్ ఉందని చెబుతూ మరోవైపు ఎడాపెడా విద్యుత్ చార్జీలు పెంచాల్సిన అవసరం  ఏంటని ప్రశ్నించారు. పెంచిన చార్జీలను తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు జి.రామకృష్ణ, డి.గౌస్‌దేశాయ్, రామాంజనేయులు, పుల్లారెడ్డి, అంజిబాబు, నగర నాయకులు పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement