పాక్‌ను శత్రువుగా చూడకండి: పాకిస్థాన్ హైకమిషనర్ సల్మాన్ బషీర్ | dont see pakistan as enemey: Pakistan's High Commissioner Salman Bashir | Sakshi
Sakshi News home page

పాక్‌ను శత్రువుగా చూడకండి: పాకిస్థాన్ హైకమిషనర్ సల్మాన్ బషీర్

Oct 7 2013 12:59 AM | Updated on Sep 1 2017 11:24 PM

పాక్‌ను శత్రువుగా చూడకండి: పాకిస్థాన్ హైకమిషనర్ సల్మాన్ బషీర్

పాక్‌ను శత్రువుగా చూడకండి: పాకిస్థాన్ హైకమిషనర్ సల్మాన్ బషీర్

త చరిత్రను వదిలి భారత్, పాక్‌లు సహకరించుకుంటే అభివృద్ధిలో ఆసియాలోనే మొదటి స్థానంలో ఉంటామని పాకిస్థాన్ హై కమిషనర్ సల్మాన్ బషీర్ పేర్కొన్నారు

 హైదరాబాద్, న్యూస్‌లైన్: పాత చరిత్రను వదిలి భారత్, పాక్‌లు సహకరించుకుంటే అభివృద్ధిలో ఆసియాలోనే మొదటి స్థానంలో ఉంటామని పాకిస్థాన్ హై కమిషనర్ సల్మాన్ బషీర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌కు వచ్చిన ఆయన ఆదివారమిక్కడి ఆసిఫ్‌నగర్‌లో ‘రహనుమాయే దక్కన్’ చీఫ్ ఎడిటర్ వికారుద్దీన్ ఇచ్చిన విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ఉగ్రవాదం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న పెద్ద సమస్య అని పేర్కొన్నారు.
 
  భారత్‌లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నా.. వాటిని పాక్‌తో ముడిపెట్టడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. పాక్‌ను శత్రువుగా చూడొద్దని విజ్ఞప్తి చేశారు. రెండు దేశాల్లోని మీడియా లేనిపోని కథనాలను సృష్టించి ప్రజలను మభ్యపెడుతోందని, వాటి తీరు మారాలని పేర్కొన్నారు. కాశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి ఇరు దేశాలు ముందుకు రావాలన్నారు. కాగా, హైదరాబాద్‌లో వీసా కార్యాలయాన్ని ఏర్పాటు చేసే అంశంపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు

Advertisement
 
Advertisement
Advertisement