‘కొత్త వాహనాలు కొనద్దు.. అద్దెకూ తీసుకోవద్దు!’ | don't buy new vehicles.. also rent | Sakshi
Sakshi News home page

‘కొత్త వాహనాలు కొనద్దు.. అద్దెకూ తీసుకోవద్దు!’

Apr 17 2014 2:32 AM | Updated on Sep 28 2018 7:36 PM

రాష్ట్ర విభజన నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖలూ కొత్తగా వాహనాలను కొనుగోలు చేయడం లేదా వాహనాలను అద్దెకు తీసుకోవడం వంటివి చేయరాదని ఆర్థిక శాఖ తెలిపింది.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖలూ కొత్తగా వాహనాలను కొనుగోలు చేయడం లేదా వాహనాలను అద్దెకు తీసుకోవడం వంటివి చేయరాదని ఆర్థిక శాఖ తెలిపింది. ఈ మేరకు నిషేధం విధిస్తూ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి అజేయ కల్లం బుధవారం మెమో జారీ చేశారు. ప్రస్తుతం వాహనాల అద్దెకు సంబంధించి చేసుకున్న ఒప్పం దాలు ముగిసే వరకు కొనసాగించాలని తెలిపారు. ఈలోగా అద్దె ఒప్పందాలు ముగిస్తే కొత్తగా అద్దె ఒప్పంద కాలాన్ని పొడిగించవద్దని మెమోలో స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఒప్పంద సమయం ఉంటే ఆ సమయానికి కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వాల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కాగా, రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రభుత్వ వాహనాలను, అలాగే అద్దె వాహనాలను కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పంపిణీ చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement