అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం: బొత్స | Discussion on illegal Construction in AP Assembly | Sakshi
Sakshi News home page

అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం: బొత్స

Jul 18 2019 10:41 AM | Updated on Jul 18 2019 10:58 AM

Discussion on illegal Construction in AP Assembly - Sakshi

శాసనసభలో బొత్స సత్యనారాయణ, ఆళ్ల రామకృష్ణారెడ్డి

అక్రమ నివాసంలో ఉంటున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నోటీసులిచ్చినట్టు వెల్లడించారు.

సాక్షి, అమరావతి: అక్రమ కట్టడాలపై కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. శాసనసభలో గురువారం ఆయన మాట్లాడుతూ.. అక్రమ నివాసంలో ఉంటున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నోటీసులిచ్చినట్టు వెల్లడించారు. టీడీపీ సభ్యుడు నిమ్మల రామానాయుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ..కరకట్టపై అక్రమ కట్టడాలన్నింటికి నోటీసులు ఇచ్చామని మంత్రి వివరించారు.

చట్టం ముందు అందరూ సమానులేనని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) అన్నారు. నదీ పరివాహక చట్టప్రకారం కరకట్టకు, నదికి మధ్య చిన్న మొక్క కూడా నాటడానికి వీల్లేదన్నారు. ఇప్పటికైనా అక్రమ నివాసం నుంచి చంద్రబాబు బయటకు రావాలని డిమాండ్‌ చేశారు. హైకోర్టు నోటీసులు ఇచ్చినా చంద్రబాబు పట్టించుకోలేదని, ప్రజావేదిక​ నిర్మాణం పేరుతో కోట్లు దోచుకున్నారని ఎమ్మెల్యే ఆర్కే మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement