తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ | Sakshi
Sakshi News home page

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Published Sun, Nov 16 2014 7:22 AM

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది.  స్వామివారి సర్వ దర్శనానికి 4 కాంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 3 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు సమయం పడుతోంది.  అయితే నడకదారి భక్తులకు దర్శనం రద్దు చేసినట్టు టీటీడీ పేర్కొంది.

ఇదిలాఉండగా, ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 22 కంపార్ట్మెంట్లు నిండాయి.  ఉచిత, రూ. 100, రూ. 50, రూ. 500 గదుల కోసం భక్తులు వేచి ఉన్నారు. భక్తుల ఉచిత గదులు 10 ఖాళీగా ఉన్నాయి.  

గదుల వివరాలు:
రూ. 50 గదులు 20,
రూ. 100 గదులు ఖాళీగా లేవు
రూ. 500 గదులు ఖాళీగా లేవు

ఆర్జిత సేవల టికెట్ల వివరాలు:
ఆర్జిత బ్రహ్మోత్సవం - ఖాళీగా లేవు, సహస్ర దీపాంలంకరణ సేవ- 70 ఖాళీగా ఉన్నాయి.
వసంతోత్సవం - ఖాళీగా లేవు

Advertisement
Advertisement