బిల్లు సెలెక్ట్‌ కమిటీకి వెళ్లలేదు: మండలి చైర్మన్‌

Council Chairman Sharif Gives Clarity On Administrative Decentralisation Bill - Sakshi

సాక్షి, అమరావతి : అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై టీడీపీ చేస్తున్న ప్రచారం తప్పని తేలిపోయింది. ఏపీ శాసన మండలి చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై స్పష్టతనిచ్చారు. బిల్లు సెలెక్ట్‌ కమిటీకి వెళ్లలేదని, సాంకేతిక కారణాలతో అది మండలిలోనే ఆగిపోయిందని అన్నారు. ఆ ప్రక్రియ పూర్తయితేగానీ వికేంద్రీకరణ బిల్లు సెలెక్ట్‌ కమిటీకి వెళ్లదని చెప్పారు. బిల్లు సెలెక్ట్‌ కమిటీకి వెళ్లిందన్న టీడీపీ ప్రచారం అవాస్తవమని వెల్లడించారు. మండలి చైర్మన్‌ ఇచ్చిన స్పష్టతతో అసలు నిజం బయటికొచ్చిందని రాష్ట్ర సమగ్రాభివృద్ధిని కోరుకుంటున్న ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, ఈ బిల్లుపై మండలి ఏ విధంగా ముందుకు వెళ్తుందనే సందిగ్దత నెలకొంది.

(చదవండి : నన్నెవరూ బెదిరించలేదు: షరీఫ్‌)

ఇక ‘మూడు రాజధానులు’ బిల్లును టీడీపీ సభ్యులు అడ్డుకోవడంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం జిల్లాల వ్యాప్తంగా పలు చోట్ల రాస్తారోకోలు, చంద్రబాబు దిష్టిబొమ్మల దహనాలు నిర్వహించారు. ప్రజలు రోడ్లెక్కి చంద్రబాబు, టీడీపీ సభ్యుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ వెన్నుపోటు రాజకీయాలకు వ్యతిరేకంగా విశాఖపట్నం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి.
చదవండి : 
ప్రజలకు మేలు చేయని మండలి అవసరమా?
మండలి చైర్మన్‌కు ఆ విచక్షణాధికారం లేదు
వీధిన పడ్డ ‘పెద్ద’ల సభ పరువు
గ్యాలరీలో చంద్రబాబు ఎందుకు కూర్చున్నారు?

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top