'రాష్ట్రంలో పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉంది' | Congress party brainstorming session at vijayawada | Sakshi
Sakshi News home page

'రాష్ట్రంలో పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉంది'

Feb 13 2015 1:07 PM | Updated on Mar 18 2019 7:55 PM

'రాష్ట్రంలో పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉంది' - Sakshi

'రాష్ట్రంలో పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉంది'

ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. శుక్రవారం విజయవాడలో కాంగ్రెస్ పార్టీ మేథోమధన సదస్సులో దిగ్విజయ్ సింగ్ ప్రసంగించారు. పదవులకే పరిమితం కాకుండా గ్రామగ్రామానికి వెళ్లాలని ఆయన పార్టీ నాయకులకు సూచించారు.

రాష్ట్ర విభజన సమయంలో యూపీఏ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన సంగతిని దిగ్విజయ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ సాధించుకోవడంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నాయకులకు, కార్యకర్తలకు దిగ్విజయ్ సింగ్ విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement