చిరంజీవి, పవన్ మ్యాచ్ ఫిక్సింగ్: నిర్మాత ఆదిశేషగిరిరావు | Chiranjeevi, Pawan Kalyan match fixing with Congress, TDP | Sakshi
Sakshi News home page

చిరంజీవి, పవన్ మ్యాచ్ ఫిక్సింగ్: నిర్మాత ఆదిశేషగిరిరావు

Apr 27 2014 2:07 PM | Updated on Mar 22 2019 5:33 PM

చిరంజీవి, పవన్ మ్యాచ్ ఫిక్సింగ్: నిర్మాత ఆదిశేషగిరిరావు - Sakshi

చిరంజీవి, పవన్ మ్యాచ్ ఫిక్సింగ్: నిర్మాత ఆదిశేషగిరిరావు

మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ పై సినీ నిర్మాత ఆదిశేషగిరిరావు మండిపడ్డారు.

కాకినాడ: మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ పై సినీ నిర్మాత ఆదిశేషగిరిరావు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు కారకులైన కాంగ్రెస్, బీజేపీలతో చిరంజీవి, పవన్‌ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆయన ఆరోపించారు. 
 
తెలుగువారిని కాంగ్రెస్, బీజేపీలు అడ్డగోలుగా విభజించారని అన్నారు.  అవసరమైతే సినీనటుడు కృష్ణ  వైఎస్ఆర్ సీపీ తరఫున ప్రచారం చేస్తారని ఓ ప్రశ్నకు ఆదిశేషగిరిరావు సమాధానమిచ్చారు. సీమాంధ్ర అభివృద్ధి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ తోనే సాధ్యమని ఆదిశేషగిరిరావు తెలిపారు. 
 
రాజకీయాల్లో చిరంజీవి ఐరన్ లెగ్ అని, పవన్‌ కాబోయే ఐరన్‌లెగ్‌ అని  వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత విజయ్‌చందర్ ఎద్దేవా చేశారు. కాకినాడలో విజయ్ చందర్ తో కలిసి ఆదిశేషగిరిరావు ప్రచారం చేశారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement