‘ఇంద్రభవన్‌లో విశ్రాంతి తీసుకొని ఇప్పుడు వచ్చాడు’

Chief VIP Srikanth Reddy Fires On TDP Leader Chandrababu Naidu - Sakshi

సాక్షి, తాడేపల్లి: కోట్లాది రూపాయలతో నిర్మించుకున్న ఇంద్రభవన్‌లో విశ్రాంతి తీసుకొని 65 రోజుల తరువాత రాష్ట్రంలో అడుగు పెట్టారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని విమర్శించారు. సోమవారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ... ‘రెండు నెలలు హైదరాబాద్‌లో ఉండి జూమ్‌ యాప్‌ ద్వారా చంద్రబాబు ప్రభుత్వంపై బురద జల్లాడు. ఎల్జీ పాలిమర్స్ విషయంలో సీఎం జగన్‌ తీసుకున్న చర్యలను దేశం మొత్తం ప్రశంసించింది. రెండు నెలల తరువాత ఇప్పుడు చంద్రబాబు వైజాగ్‌ వెళ్లి ఏం చేస్తారు. కుల, మతాలకు అతీతంగా జగన్‌మోహన్‌ రెడ్డి పాలన అందిస్తున్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయన జయంతి వేడుకలు ఎలా నిర్వహిస్తారు? మహానాడు పెద్దడ్రామా, ఎన్టీఆర్‌ ఆత్మ ఇప్పటికీ క్షోభిస్తోంది. విజయవాడలోని కరకట్టకు రోడ్‌ మార్గాన వచ్చిన చంద్రబాబు వైజాగ్‌ ఎందుకు రాలేదు. కళా వెంకట్రావు లేఖలు రాయడం కాదు, ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. చంద్రబాబు మొదట పెట్టిన ఐదు సంతకాలకు దిక్కులేదు. చంద్రబాబు మొదట పెట్టిన రుణమాఫీకి డబ్బులు ఇ‍వ్వాలని టీడీపీ నేతలు అడుగుతున్నారు. బెల్ట్‌ షాపులు రద్దు చేస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశాడు. జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలోకి రాగానే బెల్ట్‌ షాపులు రద్దు చేశారు. ఇంటికి వెళ్లక ముందే జగన్‌మోహన్‌ మొదటి సంతకాన్ని అమలు చేశారు. ఇచ్చిన హామీలనే కాదు ఇవ్వని హామీలను కూడా జగన్‌మోహన్‌ రెడ్డి అమలు చేస్తున్నారు’ అని అన్నారు. (నిరూపిస్తే రాజీనామా చేస్తా: ఎంపీ సవాల్)

ఇంకా ఆయన మాట్లాడుతూ....‘పెయిడ్‌ ఆర్టిస్టులతో ప్రభుత్వంపై విమర్శలు చేయిస్తున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలను చంద్రబాబు ఉల్లంఘించారు. చంద్రబాబు, టీడీపీ నేతలు భౌతిక దూరం పాటించలేదు. టీడీపీ నేతలు మాస్క్‌లు కూడా ధరించలేదు. చంద్రబాబు ఏపీకి రాగానే పూలు జల్లించుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన చంద్రబాబు మీద ఎన్నికేసులు పెట్టాలి. తాగి తిడితే ఎల్లో మీడియా డిబెట్లు పెడుతుంది. టీడీపీ నేతలు రాజకీయం కోసం దేవుడిని కూడా వదలడం లేదు. పోతిరెడ్డిపాడు నేనే కట్టానని చంద్రబాబు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. సీఎం జగన్‌ పాలనపైనా, ఇచ్చిన హామీలపైనా బహిరంగ చర్చకు సిద్దం’ అని శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. (సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతలు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top