‘అక్రమ మైనింగ్‌లో చంద్రబాబుకి వాటా’

Chandrababu Have Shares On Illegal Mining Says YV Subba Reddy - Sakshi

పశ్చిమ గోదావరి : టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేత అబ్బయ్య చౌదరి రాయన్నపాలెంలో చేపట్టిన నిరహార దీక్ష ఉద్రిక్తల పరిస్థితుల నడుమ ప్రారంభమైంది. అక్రమంగా క్వారీని నడుపుతున్నా చింతమనేనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని అబ్బయ్య చౌదరి విమర్శించారు. దెందులూరులో జరుగుతున్న దోపిడీ కేవలం నియోజకవర్గ పరిధిలోనిది కాదని.. దీనిలో సీఎం చంద్రబాబు నాయుడికి కూడా వాటా ఉందని వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ వై.వీ సుబ్బారెడ్డి ఆరోపించారు. రాయన్నపాలెంలో శనివారం ప్రారంభమైన దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. అధికార యంత్రాంగం పూర్తిగా ప్రభుత్వ తొత్తుగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. అన్యాయం గురించి ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు పెట్టి నోరు నొక్కెస్తున్నారని విమర్శించారు.

అక్రమ మైనింగ్‌ వెనుక ఉన్న అధికారులపై చర్యలు తీసుకుంటామని.. వారిపై కోర్టుకు కూడా వెళ్తామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో చింతమనేని తన అవినీతి వైఖరి మార్చుకోకపోతే ప్రజలే ఓటు ద్వారా బుద్ది చెప్తారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఆళ్ళనాని హెచ్చరించారు. పబ్లిక్‌గా ఇసుకా, గ్రావెల్‌ అమ్ముకుంటుంటే అధికారులు చోద్యం చూస్తున్నారా అని ప్రశ్నించారు. కలెక్టర్‌కి వినితి పత్రం ఇచ్చినా కూడా ధైర్యంగా దందాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చింతమనేని అక్రమ క్వారిపై ఎంక్వయిరీ వేస్తామని ఏలూరు పార్లమెంట్‌ వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్‌ కోటగిరి శ్రీధర్‌ అన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top