నకిలీ పత్రాలతో రూ.2.5 కోట్ల రుణం | case filed for Rs 2.5 crores fraud | Sakshi
Sakshi News home page

నకిలీ పత్రాలతో రూ.2.5 కోట్ల రుణం

Jun 17 2015 3:06 PM | Updated on Aug 13 2018 8:03 PM

నకిలీ పత్రాలతో ముగ్గురు వ్యక్తులు బ్యాంకు నుంచి రూ.2.5 కోట్లను రుణంగా పొందినట్టు తేలడంతో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు శాఖ అధికారులు బుధవారం పోలీసులను ఆశ్రయించారు.

ఏలూరు: నకిలీ పత్రాలతో ముగ్గురు వ్యక్తులు బ్యాంకు నుంచి రూ.2.5 కోట్లను రుణంగా పొందినట్టు తేలడంతో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు శాఖ అధికారులు బుధవారం పోలీసులను ఆశ్రయించారు. బ్యాంకు చీఫ్ మేనేజర్ ఎన్.రవికాంత్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి సీఐ బంగార్రాజుకు ఫిర్యాదు చేశారు. విచారణ చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement