గుంటూరు జిల్లాలో వ్యాపారిపై కాల్పులు | businessman shot by unidentified persons at Guntur district | Sakshi
Sakshi News home page

గుంటూరు జిల్లాలో వ్యాపారిపై కాల్పులు

Oct 29 2013 3:33 PM | Updated on Aug 24 2018 2:33 PM

గుంటూరు జిల్లాలో వ్యాపారిపై కాల్పులు - Sakshi

గుంటూరు జిల్లాలో వ్యాపారిపై కాల్పులు

గుంటూరు జిల్లాలోని పిట్లవానిపాలెంలో ఆంజనేయులు అనే వ్యాపారి నివాసంపై కొంతమంది దుండగులు మంగళవారం కాల్పులు జరిపారు.

గుంటూరు జిల్లాలోని పిట్లవానిపాలెంలో ఆంజనేయులు అనే వ్యాపారి నివాసంపై కొంతమంది దుండగులు మంగళవారం కాల్పులు జరిపారు. దాంతో వ్యాపారి ఆంజనేయులు పోలీసులను ఆశ్రయించారు. రూ. 15 లక్షల నగదు ఇవ్వాలని ఇటీవల ఆగంతకులు తనకు ఫోన్ చేసి డిమాండ్ చేశారని ఆయన పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

 

అంత మొత్తంలో నగదు ఇవ్వకపోవడంతో దుండగులు ఈ రోజు ఉదయం తన నివాసంపై కాల్పులకు తెగబడ్డారని పోలీసులకు చేసిన ఫిర్యాదులో ఆంజనేయులు వివరించారు. కుటుంబ సభ్యులంతా ఇంట్లో ఉండటంతో ఎవరికి గాయాలు కాలేదని ఆయన పేర్కొన్నారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాల్పులకు తెగబడిన దుండగులకు సాధ్యమైంత త్వరగా పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు. అందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు వివరించారు.దుండగుల కాల్పుల శబ్దంతో స్థానికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో ఒక్కసారిగా స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement