విజయనగరం జిల్లాలో కిడ్నాప్‌ కలకలం | boy kidnap in vizianagaram district | Sakshi
Sakshi News home page

విజయనగరం జిల్లాలో కిడ్నాప్‌ కలకలం

Jun 30 2017 11:56 AM | Updated on Jul 12 2019 3:29 PM

విజయనగరం జిల్లాలో మూడేళ్ల బాలుడి కిడ్నాప్‌ కలకలం రేగింది.

పూసపాటిరేగ: విజయనగరం జిల్లాలో మూడేళ్ల బాలుడి కిడ్నాప్‌ కలకలం రేగింది. జిల్లాలోని పూసపాటిరేగ మండలం పోరాం గ్రామానికి చెందిన మూడేళ్ల బాలుడిని గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. గ్రామానికి చెందిన మాదేష్‌(3) అలియాస్‌ పండును దుండుగులు కిడ్నాప్‌ చేశారు.
 
ఇంటి ముందు తాతయ్యతో కలిసి ఆడుకుంటున్న సమయంలో బైక్‌పై వచ్చిన దుండగులు మంచినీళ్లు అడిగారు. పెద్దాయన నీళ్లు తేవడానికి ఇంట్లోకి వెళ్లి వచ్చే లోపు మాదేష్‌ను ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాలుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement