మృతదేహాలను త్వరగా తరలించాలి:ఎమ్మెల్యే రంగారావు | Bodies move quickly: MLA Ranga Rao | Sakshi
Sakshi News home page

మృతదేహాలను త్వరగా తరలించాలి:ఎమ్మెల్యే రంగారావు

Jun 29 2014 6:47 PM | Updated on Apr 6 2019 8:51 PM

సుజయ కృష్ణరంగారావు - Sakshi

సుజయ కృష్ణరంగారావు

చెన్నైలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిన ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణరంగారావు పరామర్శించారు.

విజయనగరం: చెన్నైలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిన  ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణరంగారావు పరామర్శించారు. ఈ ఘటనలో విజయనగరం జిల్లా కార్మికులే ఎక్కువ మంది మృతి చెందారు. దర్టీరాజేరు మండలం కృష్ణాపురం గ్రామం, మక్కువ మండలం సూరిమామిడి గ్రామాల్లో మృతుల కుటుంబాల వారు ఉన్నారు. వారిని పరామర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మృతదేహాలను త్వరగా సొంత గ్రామాలకు చేర్చాలని కోరారు.

ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించాలని రంగారావు కోరారు.

 ఇదిలా ఉండగా, మృతుల కుటుంబాలను  మంత్రి మృణాళిని కూడా పరామర్శించారు. మృతులు ఒక్కొక్కరికి   ప్రభుత్వం 5లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50 వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement