బిజివేముల కోట..రాజన్న బాట | Bijivemula Veera Reddy Is King of Badvel Constituency | Sakshi
Sakshi News home page

బిజివేముల కోట..రాజన్న బాట

Mar 15 2019 8:59 AM | Updated on Mar 15 2019 9:01 AM

 Bijivemula Veera Reddy Is King of Badvel Constituency  - Sakshi

సాక్షి, కడప : కడపకు ఈశాన్య దిశలో 60 కిలోమీటర్ల దూరంలో అసెంబ్లీ  నియోజకవర్గ కేంద్రమైన బద్వేలు ఉంది. సుమతి శతక కారుడు బద్దెన ఈ ప్రాంతాన్ని పాలించారు. దీంతో పూర్వం ఈ ప్రాంతాన్ని బద్దెనవోలుగా పిలిచేవారు. కాలక్రమంలో అది బద్వేలుగా మారిందని చెబుతారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలు ఈ నియోజకవర్గానికి సరిహద్దులుగా ఉన్నాయి. లంకమల అభయారణ్యం, నల్లమల అడవులు వ్యాపించి ఉన్నాయి. ఇది కడప లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది.

బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకి కలసపాడు, పోరుమామిళ్ల, బి.కోడూరు, కాశినాయన, గోపవరం, అట్లూరు మండలాలు వస్తాయి. ఈ నియోజకవర్గానికి ఇప్పటివరకు 16 మార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్, కాంగ్రెస్‌–జెలు కలిసి ఏడుసార్లు, టీడీపీ నాలుగుసార్లు, వైఎస్సార్‌ కాంగ్రెస్, పీఎస్‌పీ, ఇండిపెండెంట్, జనతా పార్టీ అభ్యర్థులు ఒక్కొక్కసారి గెలిచారు. బద్వేలు నుంచి బి.వీరారెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు. ఆయన గతంలో ఎన్టీ రామారావు, చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు.   

2011 గణాంకాల ప్రకారం ....
జనాభా : 2,74,179
రూరల్‌ :74.24 శాతం
అర్బన్‌ : 25.76 శాతం  
మొత్తం ఓటర్లు : 1,91,237
పోలింగ్‌ కేంద్రాలు : 272 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement