సిఎం 'రచ్చబండ'తో మరోసారి వంచిస్తున్నారు: భూమన | Bhumana Karunakar Reddy fire on CM Kiran Kumar Reddy | Sakshi
Sakshi News home page

సిఎం 'రచ్చబండ'తో మరోసారి వంచిస్తున్నారు: భూమన

Nov 12 2013 11:35 AM | Updated on Jul 29 2019 5:31 PM

సిఎం 'రచ్చబండ'తో మరోసారి వంచిస్తున్నారు: భూమన - Sakshi

సిఎం 'రచ్చబండ'తో మరోసారి వంచిస్తున్నారు: భూమన

రచ్చబండ పేరుతో ప్రజలను మోసం చేసేందుకు సీఎం కిరణ్ సిద్ధమయ్యారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.

రచ్చబండ పేరుతో ప్రజలను మోసం చేసేందుకు సీఎం కిరణ్ సిద్ధమయ్యారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. సమైక్యాంధ్ర ముసుగులో నాడు విభజనను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించిన సీఎం నేడు  విభజిస్తే ప్యాకేజీలు కావలని డిమాండ్ చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన రీతిలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతారని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.

 

కిరణ్ ప్రభుత్వం రాష్ట్రంలో మూడో విడత రచ్చబండ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ఎగసిపడుతుంది. ఈ నేపథ్యంలో సీమాంధ్ర ప్రజల దృష్టి మరల్చేందుకు రచ్చబండ కార్యక్రమన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని పలువురు అభిప్రాయపడ్డుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement