భార్యతో కలిసి పవన్‌ భూమిపూజ | Bhoomi Puja For Pawan's New House At Guntur | Sakshi
Sakshi News home page

భార్య లెజ్నేవాతో కలిసి పవన్‌ భూమిపూజ

Mar 12 2018 9:59 AM | Updated on Mar 22 2019 5:33 PM

Bhoomi Puja For Pawan's New House At Guntur - Sakshi

గుంటూరులో కొత్త ఇంటికి భూమిపూజ (ఇన్‌సెట్‌లో పవన్‌-లెజ్నేవా పాత ఫొటో)

గుంటూరు : సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ గుంటూరులో సందడిచేశారు. ఖాజా టోల్‌గేట్‌ సమీపంలో నిర్మించనున్న కొత్త ఇంటికి సోమవారం ఉదయం శంకుస్థాపన చేశారు. హిందూ సంప్రదాయ పద్ధతుల్లో భార్య అన్నా లెజ్నేవాతో కలిసి భూమిపూజ నిర్వహించారు. ఆదివారం రాత్రే విజయవాడకు చేరుకున్న పవన్‌ ఫ్యామిలీకి పోలీసులు పటిష్టభద్రతను కల్పించారు. అట్టహాసంగా జరిగిన భూమిపూజకు పవన్‌ అభిమానులు, జనసేన కార్యకర్తలు తరలివెళ్లారు.

మార్చి 16న గుంటూరులో జనసేన ఆవిర్భావ సభ నేపథ్యంలో పవన్‌.. ముఖ్యనేతలతో సమావేశంకానున్నారు. కాగా, ఆవిర్భావ సభకు సంబంధించి జనసేన కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. సభకు వచ్చేవారు టోల్‌ ప్లాజా సిబ్బందితో తగువులు పెట్టుకోవద్దని, చెట్లు, గోడలు, టవర్లు, స్పీకర్లపైకి ఎక్కొద్దని పార్టీ అధికారి ట్విటర్‌లో సూచనలు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement