‘మార్చి 31 తర్వాత సిద్ధంగా ఉండండి’ | Be ready after March 31 | Sakshi
Sakshi News home page

‘మార్చి 31 తర్వాత సిద్ధంగా ఉండండి’

Feb 11 2018 5:16 PM | Updated on Aug 13 2018 3:11 PM

Be ready after March 31 - Sakshi

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం(పాత చిత్రం)

చిత్తూరు : ఇచ్చిన మాటను మార్చి 31లోపల నెరవేర్చాలని లేదంటే ఎటువంటి ఉద్యమానికైనా సిద్ధంగా ఉండాలని కాపులకు కాపు రిజర్వేషన్‌ ఉద్యమ పోరాటనేత ముద్రగడ పద్మనాభం  పిలుపునిచ్చారు. చిత్తూరులో విలేకరులతో మాట్లాడుతూ.. కాపు జాతికి ఎన్నికల సమయంలో ఇస్తామన్న రిజర్వేషన్ హామీ నెరవేర్చలేదని, అందుకే రాష్ట్ర వ్యాప్తంగా గర్జన చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.హమీ మేరకు రిజర్వేషన్‌ ఇవ్వాలని కోరినందుకే ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు.

గోదావరి జిల్లాల్లో కాపు సోదరులను టీడీపీ నాయకులు, పోలీసులు చాలా ఇబ్బందులు పెట్టారని వ్యాఖ్యానించారు. ‘ఏ కోరిక తాము కోరకపోయినా హామీలు ఇచ్చింది మీరు...ఇచ్చిన హామీ మేరకు 5 శాతం రిజర్వేషన్ కాకుండా 10 శాతం ఇవ్వాలని కోరుతున్నాం’  అని తెలిపారు. జనాభా ప్రాతిపదికన ఇవ్వాలని, గవర్నర్ ఆమోదం తర్వాత రాష్ట్రపతి ఆమోదం పొందేలా చూడాలని ముద్రగడ పద్మనాభం ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement