కరుణ లేదా? | Bankers to farmers to lease another game | Sakshi
Sakshi News home page

కరుణ లేదా?

Aug 23 2015 11:37 PM | Updated on Jun 4 2019 5:04 PM

ఖరీఫ్‌లో రైతులతో వరుణుడు దోబూచులాడుతుంటే కౌలు రైతులతో బ్యాంకర్లు మరో ఆట ఆడుతున్నారు రుణాలు ఇవ్వాలని

విజయనగరం కంటోన్మెంట్: ఖరీఫ్‌లో రైతులతో వరుణుడు దోబూచులాడుతుంటే కౌలు రైతులతో బ్యాంకర్లు మరో  ఆట ఆడుతున్నారు  రుణాలు ఇవ్వాలని బ్యాంకర్ల కాళ్లావేళ్లా పడ్డా  రుణాలు ఇవ్వడం లేదు సరికదా మీరు రైతుల పట్టాదారు పాసు పుస్తకం, దాని జిరాక్సు తీసుకువస్తే అప్పుడు చూద్దామని చెబుతున్నారు. దరఖాస్తు చేసుకుంటే చాలు వీరికి రుణ అర్హత కార్డులిచ్చి రుణాలిస్తామని చెప్పిన అధికారులు, బ్యాంకర్లు ప్రస్తుతం ముఖం చాటేస్తున్నారు. జిల్లాలో దాదాపు లక్షా 20 వేల మంది కౌలు రైతులున్నారని అంచనా! కానీ ప్రభుత్వ యంత్రాంగం మాత్రం తాము సర్వే చేశామని, జిల్లా లో కౌలు రైతులు 62 వేల మంది మాత్రమే ఉన్నారని తేల్చింది. ప్రస్తుతం తాము సర్వేచేసిన వారినే కౌలు రైతులుగా గుర్తిస్తూ రుణ అర్హత కార్డులు ఇస్తామనీ నమ్మబలికిన అధికారులు గ్రామ సభలు నిర్వహించి రుణ అర్హత కార్డులు ఇస్తామని చెప్పారు. కానీ జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది కేవలం 12 వేల మందికి మాత్రమే కార్డులు ఇచ్చారు.  
 
 గ్రీవెన్‌‌సలో ఫిర్యాదు
 బొండపల్లి మండలం దేవుపల్లికి చెందిన ఓ పది మంది రైతులు తమకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వడం లేదని పెట్టుబడులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయనీ తమకు రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఇటీవల గ్రీవెన్స్‌సెల్‌లో  అర్జీ అందజేసి కోరారు. కానీ ఇప్పటి వరకూ వారికి ఎటువంటి రుణాలూ ఇవ్వలేదు. పట్టాపుస్తకాలు ఇవ్వాలని అడుతున్నారని  అసలు రైతులకే పట్టా పుస్తకాలు పూర్తి స్థాయిలో ఇవ్వకపోతే తామెలా వారిని తీసుకువస్తామని కౌలు రైతులు వాపోతున్నారు.  2012లో 13వేల  మంది కౌలు రైతులకు రూ.4 కోట్లు మాత్రమే రుణాలుగా ఇచ్చారు. 2013లో రూ.5 కోట్లు ఇవ్వగా 2014లో  రూ.3 కోట్లు ఇచ్చి చేతులు దులు పుకొన్నారు. పదివేల మంది రైతులకు  రుణ ప్రణాళిక ప్రకారం పంట రుణాలు ఇవ్వాలంటే రూ.120 కోట్లు అవసరమవుతుంది. కానీ అలా ఇవ్వడం లేదు. భూమి సాగు చేయక వదిలేస్తున్న యజమానులున్న ఈ రోజుల్లో భూమి తనది కాకున్నా కాయకష్టాన్నే నమ్ముకుని అటు యజమానికి, ఇటు బ్యాంకర్లు, ప్రభుత్వానికి కిస్తీలు చెల్లిస్తున్న  తమ పట్ల నిర్లక్ష్యం సరికాదని  కౌలురైతులు వాపోతున్నారు. సాధారణ రైతులకు ఇచ్చే విధంగా చెరుకు, వరి, అరటి పంటలకు రుణ ప్రణాళిక ప్రకారం రుణాలివ్వాలని ఉన్నా కౌలు రైతులకు మాత్రం ఎంతో కొంత ఇవ్వడం నిర్లక్ష్య వ్యవహారమని  వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement