ఏపీలో తొలిసారిగా బాలోత్సవ్‌

Balostav for the first time in AP - Sakshi

నంబూరు వీవీఐటీలో లాంఛనంగా ప్రారంభం

నంబూరు (తెనాలి): ప్రపంచ బాలల పండుగ–2017 పేరుతో గుంటూరు జిల్లా నంబూరులోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (వీవీఐటీ)లో ఆదివారం వేలాది పిల్లల కోలాహలం మధ్య బాలోత్సవ్‌ ప్రారంభమైంది. తెలంగాణలోని భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో ఏటా బాలోత్సవ్‌ జరుగుతుంది. తొలిసారిగా ఇప్పుడు నవ్యాంధ్రలో మొదలైంది. 610 పాఠశాలల నుంచి 10 వేల మంది విద్యార్థులు, వారి తలిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్న వేడుకను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ ఎ.రాజేంద్రప్రసాద్‌ జ్యోతి ప్రజ్వలన చేసి ఆరంభించారు. చిన్నారులు, అతిథులు బెలూన్లు ఎగుర వేశారు. అనంతరం వీసీ మాట్లాడుతూ  బాలోత్సవ్‌ నిర్వహించడం అభినందనీయమన్నారు.

Back to Top