విశాఖ జిల్లా వ్యాప్తంగా రేపు, ఎల్లుండి ఆటోలు బంద్ | auto union association ready to protest in visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖ జిల్లా వ్యాప్తంగా రేపు, ఎల్లుండి ఆటోలు బంద్

Aug 29 2013 6:05 PM | Updated on Sep 1 2017 10:14 PM

ఇప్పటికే సమైక్య నినాదాలతో హోరెత్తెస్తున్నఉద్యమకారులకు ఆటో యూనియన్ లు కూడా జతకలవనునన్నాయి.

విశాఖ:ఇప్పటికే సమైక్య నినాదాలతో హోరెత్తెస్తున్న ఉద్యమకారులకు ఆటో యూనియన్ లు కూడా జతకలవనునన్నాయి. విశాఖ జిల్లాలో రేపు, ఎల్లుండి బంద్ పాటించి సమైక్యాంధ్రకు మద్దతు తెలుపుతామని ఆటో యూనియన్ ల సంఘం ప్రకటించింది. కాగా, టాక్సీ ఓనర్ల అసోసియేషన్ కూడా మద్దతు తెలిపేందుకు సన్నద్ధమైంది. రెండు రోజుల పాటు నిరవధిక సమ్మె చేస్తామని టాక్సీ ఓనర్స్ ప్రకటించారు. ఇదిలా వుండగా విద్యార్థి జేఏసీ కూడా లాంగ్ మార్చ్ నిర్వహించేందుకు సిద్ధమైంది.
 

రానున్న ఎన్నికలను దృష్టిలో వుంచుకుని ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న ఏకపక్ష  నిర్ణయాన్ని తప్పుబడుతూ అన్నివర్గాల ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సమైక్యాంధ్ర ధ్యేయంగా నినదిస్తున్నారు. యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం, ప్రధాన రహదారుల్లో రాస్తారోకోలు, మానవహారాలు నిర్వహిస్తూ తమ నిరసనను తెలియజేస్తున్నారు.  సమైక్యాంధ్ర, రాజకీయ, విద్యార్థి, ప్రజాసంఘాల జేఏసీల ఆధ్వర్యంలో బుధవారం జిల్లా వ్యాప్తంగా భారీ ర్యాలీలు, మానవహారాలు, ధర్నాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం తన ప్రకటనను వెనక్కు తీసుకునే వరకూ సమ్మెలు కొనసాగిస్తామని ఆందోళన కారులు హెచ్చరిస్తు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement