నెల్లూరులో రెచ్చిపోయిన దోపిడి దొంగలు | attack and robbery in psr nellore district | Sakshi
Sakshi News home page

నెల్లూరులో రెచ్చిపోయిన దోపిడి దొంగలు

Apr 21 2016 8:03 PM | Updated on Aug 30 2018 5:27 PM

నెల్లూరు జిల్లాలో గురువారం మధ్యాహ్నం దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. స్థానిక ఉస్మాన్‌సాహెబ్‌పేటకు చెందిన ఆదిలక్ష్మమ్మ(80) తన కోడలు సుభాషిణితో కలిసి నివాసముంటోంది.

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో గురువారం మధ్యాహ్నం దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. స్థానిక ఉస్మాన్‌సాహెబ్‌పేటకు చెందిన ఆదిలక్ష్మమ్మ(80) తన కోడలు సుభాషిణితో కలిసి నివాసముంటోంది.

ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం అత్తాకోడళ్లు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు వారిని తీవ్రంగా గాయపరిచి ఇంట్లో ఉన్న 20 సవర్ల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఇది గుర్తించిన స్థానికులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement